BigTV English

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు భారీ షాక్.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు భారీ షాక్.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మద్యం విధానంలో అక్రమాలపై సీబీఐ అరెస్టును కోర్టు సమర్థించింది. అయితే ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలో ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టి వేసింది.


సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగిందనడానికి ఆధారాలు లేవని తెలిపింది. అంతే కాకుండా బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును కొట్టి వేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మొదట కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఊరట లభించినప్పటికీ మద్యం విధానంలో అక్రమాలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తిహార్ జైల్లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

Also Read: మోదీ సాహసోపేత నిర్ణయానికి ఐదేళ్లు పూర్తి


మనీలాండరింగ్ కేసులో జులై 12న సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు అయినప్పటికీ .. సీబీఐ కేసు కారణంగా ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఊహలు, కల్పనలేని వాదనలు
ఊహలు, కల్పనలతో పట్టుకునేందుకు యత్నిస్తున్నారని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇన్సూరెన్స్ అరెస్ట్ కారణంగా మళ్లీ మొదటి దశకు వచ్చిందని అన్నారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్ అని చెప్పేందుకు ఆయన ప్రమేయంపై ప్రత్యక్ష సాక్ష్యాలు సీబీఐ ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు. అరెస్ట్ చట్టవిరుద్ధం కాదని కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని అన్నారు. కేజ్రీవాల్ పై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసినంత మాత్రాన సీఎం బెయిల్ పై విడుదల అయ్యే అర్హత లేదని ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు.

Also Read: మహారాష్ట్రలో ఒంటరిగానే బరిలోకి దిగనున్న ఆప్

ఇన్సూరెన్స్ అరెస్ట్ అనే పదాన్ని ఉపయోగించడం సమర్థనీయం కాదని అన్నారు. కేజ్రీవాల్ కు సీబీఐ ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ న్యాయవాది సింఘ్వీ తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు జైల్లో ఉన్న ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జుడీషియల్ రిమాండ్ విధించారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×