BigTV English

Delhi Next CM: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఈయనే.. మాజీ సిఎం కుమారుడికి పగ్గాలు?

Delhi Next CM: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఈయనే.. మాజీ సిఎం కుమారుడికి పగ్గాలు?

Delhi Next CM Parvesh Sahib Singh Verma | ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బిజేపీ) స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఆప్ పార్టీ అగ్రనేతలు అరవింద్ర కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆతిషి మార్లెనా సింగ్ కూడా కేవలం 3500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. అయితే బిజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సిఎం కుమారుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.


న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ తో పోటీ పడి విజయం సాధించారు పర్వేష్ సింగ్ వర్మ.. గత పదేళ్లలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను, చేసిన తప్పులను పర్వేష్ వర్మ తరుచూ విమర్శిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, మౌళిక వసతులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆప్ పరిపాలన ఎత్తిచూపారు. తాజాగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిమఖ పోటీ నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీతో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడ్డాయి. ఈ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ అవినీతి కేసులో జైలు కెళ్లారు. ఆ తరువాత సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేశాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆప్ నాయకురాలు ఆతిషి సింగ్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. కానీ మద్యం పాలసీ అవినీతి ఆరోపణలు.. కేజ్రీవాల్‌పై ఎన్నికల్లో ప్రభావితం చేశాయి. ఈ కారణంగానే ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

Also Read: మద్యం, ధన దాహంతోనే కేజ్రివాల్ ఓటమి.. అన్నా హజారే విమర్శలు


మరోవైపు బిజేపీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారనేది కీలకంగా మారింది. కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని ఓడించిన పర్వేష్ వర్మపైనే అందరి చూపులు ఉన్నాయి. న్యూ ఢిల్లీ నియోజకవర్గం ఎన్నికల బరిలో కేజ్రీవాల్ పై పర్వేష్ సింగ్ వర్మ 4089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కు దాదాపు 4,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

పర్వేష్ సింగ్ వర్మ ఎవరు?
బిజేపీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సింగ్ వర్మ. ఆయన బాబాయ్ ఆజాద్ సింగ్ గతంలో ఉత్తర్ ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని ముండ్కా నియోజకవర్గం నుంచి బిజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు.

1977వ సంవత్సరంలో జన్మించిన పర్వేష్ వర్మ్ ఆర్ కె పురం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనుబంధంగా ఉన్న కిరోరీ మల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి ఎంబిఏ పూర్తిచేశారు.

రాజకీయాల్లో పర్వేష్ వర్మ ఎంట్రీ
2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటే పర్వేష్ వర్మ పోటీ చేశారు. ఇదే ఆయనకు రాజకీయాల్లో అధికారిక ఎంట్రీ. ఢిల్లీలోని మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి 2013 ఎన్నికల్లో పోటీ చేసి పర్వేష్ వర్మ విజయం సాధించారు. కానీ 2014 లో లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ సీటుకు పోటీ చేసి గెలవడంతో మెహ్‌రౌలీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత మళ్లీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 5.78 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎంపీగా పదేళ్లపాటు పనిచేసిన పర్వేష్ సింగ్ వర్మ అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలను పర్యవేక్షించే జాయింట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్, అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో చేసిన హామీలు కేజ్రీవాల్, ఆప్ ప్రబుత్వం పూర్తి చేయలేదని పదే పదే విమర్శించారు. బిజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పర్వేష్ సింగ్ వర్మ ఢిల్లీ కాలుష్యం, మహిళలకు భద్రత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి సమస్యలు లేవనెత్తారు. ఆప్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. ముఖ్యంగా యమునా నది కాలుష్యాన్ని చూపిస్తూ నగరంలో ప్రమాదకర వాతావరణానికి ఆప్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×