BigTV English
Advertisement

Digvijay Singh Congress: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు

Digvijay Singh Congress: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు

BJP Coverts In Congress Digvijay Singh | కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆదివారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంస్థాగత బలహీనత గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఈ సంఘటన గమనార్హం.


గుజరాత్ కాంగ్రెస్‌లో కొందరు నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, అవసరమైతే వారిపై వేటు వేసేందుకు వెనుకాడేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని ఎప్పుడు బహిష్కరిస్తారు?” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య


ఈ సందర్భంగా.. దిగ్విజయ్ సింగ్ తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. “గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు, ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా మాట్లాడవద్దని నాకు సూచనలు అందాయి. దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. అయితే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్‌లు మతం పేరుతో హిందువులను దోపిడీ చేస్తున్నారని నేను విరుచుకుపడ్డాను. నిజానికి, ఆర్ఎస్ఎస్ హిందువులకు ప్రాతినిధ్యం వహించదు. బదులుగా, మతం పేరుతో వారిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారినే దోపిడీ చేస్తుంది,” అని ఆయన విమర్శించారు.

అలాగే, ఎన్నో ఏళ్లుగా హిందూ ఆధ్యాత్మిక నేతలు స్థాపించిన శంకరాచార్యుల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. “వారిలో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌ను మద్దతుగా నిలబడిన వారు ఎవరైనా ఉన్నారా?” అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే?..

బీజేపీతో రహస్యంగా కలిసి పని చేస్తున్న వ్యక్తులను గుర్తించి, వారిని పార్టీ నుండి బహిష్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్‌లో అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజలకు దూరంగా ఉండి, బీజేపీతో రహస్యంగా కలిసి పని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన రాహుల్ గాంధీ, పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. బీజేపీ కోసం పని చేస్తున్న నాయకులను పార్టీ నుండి తొలగించాలని, అలాంటి వారు 30 నుండి 40 మంది ఉన్నా వారిని పార్టీలో ఉంచుకోవలసిన అవసరం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా విభజించవచ్చని రాహుల్ గాంధీ వివరించారు. పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేస్తూ, ప్రజలకు దగ్గరగా ఉండే వర్గం ఒకటి అయితే, ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేకుండా బీజేపీతో రహస్యంగా పని చేస్తున్న వారు మరొక వర్గం అని ఆయన తెలిపారు. పార్టీలో సగం మంది బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మనం ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. పది మందో, ఇరవై మందో, నలభై మందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. బీజేపీతో సంబంధం కలిగి ఉంటే, వారిని పార్టీ నుండి బహిష్కరించాల్సిందే,” అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. “మేము వారిని ఇక్కడ నుండి తొలగించిన తర్వాత, వారికి అక్కడ కూడా స్థానం దొరకదు,” అని ఆయన అన్నారు. ఈ రెండు వర్గాలను విభజించకపోతే, గుజరాత్ ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్‌ను నమ్మరని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×