BigTV English

Illu Illalu Pillalu Today Episode: జాబ్ కోసం ధీరజ్ వేట.. భాగ్యం ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode: జాబ్ కోసం ధీరజ్ వేట.. భాగ్యం ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode March 10 th : నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తన ఫ్యామిలీ తో కలిసి భాగ్యం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ భాగ్యం తాను గొప్పింట్లో ఉంటామని ఏదో కవరింగ్ చేసి కూతురు పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. రామరాజు ఫ్యామిలీ మొత్తం భాగ్యం చెప్పేది నిజమే అని నమ్ముతారు. భాగ్యం ఎక్కడా డౌట్ రాకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. శ్రీవల్లి చందును ఎలాగైన బుట్టలోకి వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. కోడలికి అత్త సపోర్ట్ బాగానే ఉంది. పెళ్లి అయ్యాక నా కూతురుతో దీనికి చెక్ పెట్టించి నోరు మూయించాలి అని అనుకుంటుంది. సరే మీరు మా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే పక్కకి వెళ్లి మాట్లాడండి అల్లుడు గారూ .. అని అంటుంది భాగ్యం. ఇక చందు వెళ్లాలా వద్దా అని తండ్రి వైపు చూస్తాడు. తండ్రి సైగ చేయడంతో.. శ్రీవల్లితో ఒంటరిగా మాట్లాడటానికి వెళ్తాడు. అక్కడ శ్రీవల్లి చందూతో కళ్ళు కలిపేస్తుంది. ముగ్గులోకి దించేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ ద్వారా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే అతను ఎవరైనా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు నువ్వేంటి సెటిల్ అవ్వకముందే పెళ్లి చేసుకున్నావ్ అంటే నీకు అంత బాధ్యత లేదా అనేసి అనగానే లేదు సార్ నేను ప్రేమించి పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను అందుకే జాబ్ కోసం తిరుగుతున్నానని ధీరజ్ అంటాడు కానీ అతను జాబ్ ఇవ్వడానికి ఒప్పుకోడు.. ధీరజ్ అలా చాలా ఆఫీసులకి షాపులకి వెళ్లి జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. నాకు జీవితం విలువ తెలిసి వచ్చింది నేను జాబ్ చేసి కష్టపడి ప్రేమను కూడా చూసుకోవాలనుకున్నాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకడం లేదని బాధపడతాడు దానికి తన ఫ్రెండు నువ్వేం బాధపడొద్దు ధీరజ్ అని ధైర్యం చెబుతాడు.

ఇక రామరాజు భాగ్యములో భర్తని మీరు ఎక్కడ ఆఫీస్ అని అడుగుతారు. దానికి అతను ఎక్కడ జనాలు ఉంటే అక్కడే ఇడ్లీ అవి అనేసి అనగానే భాగ్యం అతని ఆపుతుంది. అదే అన్నయ్యగారు మేము స్వయంవరం కి వచ్చినప్పుడు చెప్పాను కదా ఫైనాన్స్ బిజినెస్ అని జనాలు ఎక్కడుంటే అక్కడికి అంటే పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళకి కూడా వెళ్లి వాళ్ళ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకొని వాళ్లకి ఫైనాన్స్ అప్పు ఇస్తాము అనేసి అంటుంది. తర్వాత మీకు దీంతోపాటు ఇంకో రెండు ఇల్లు ఉన్నాయని అన్నారు కదా ఎక్కడ ఉన్నాయి. అద్దెకు ఇచ్చారా అని అడుగుతాడు. దానికి భాగ్యం ఈయన పిచ్చి రామరాజు అనుకున్నాను కానీ చాప కింద నీరు లాగా మొత్తం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అని కవర్ చేయడానికి నాన్న తంటాలు పడుతుంది. అలాగే రామరాజు మీకు స్థలాలు, పొలాలు ఉన్నాయని అన్నారు అవి ఎక్కడా ఉన్నాయని అడుగుతారు.


భాగ్యం తెలివిగా కవర్ చేస్తుంది. రామరాజు చెల్లెమ్మ అవసరం లేదు మీ ఇల్లు చూశాం మిమ్మల్ని చూసాం మేము మర్యాదల వల్ల మాకు అంత తెలిసిపోయింది అని రామరాజు అంటాడు.. చందుకు శ్రీవల్లి బాగా నచ్చేస్తుంది ఇక పెళ్లికి సంబంధించిన ముహూర్తాలను పెట్టిస్తామని అంటారు. అటు రామరాజు కూడా మా పూజారి తో మాట్లాడేసి ముహూర్తాలు పెట్టిస్తాం అప్పుడు మీకు కబురు చేస్తామండి అని వెళ్ళిపోతారు. ఇక భాగ్యం మన ప్లాన్ సక్సెస్ నీ పెళ్లి భారీ హిట్టు అనేసి సంబరపడిపోతుంది. ధీరజ్ మాత్రం జాబ్ కోసం ఊరంతా వెతుకుతూనే ఉంటాడు. ఎలాగైనా జాబ్ సంపాదించి ప్రేమను బాగా చూసుకోవాలని టెన్షన్ పడుతుంటాడు.

ధీరజ్ ప్రేమ ఫ్రెండుకి ఫోన్ చేసి ప్రేమ గురించి అడుగుతాడు. ప్రేమ మధ్యాహ్నమే వెళ్ళిపోయింది ధీరజ్ తనని నేను ఒక కాఫీ షాప్ దగ్గర చూశాను అని అంటుంది. కాఫీ షాప్‌లో వెయిటర్‌గా జాబ్‌లో జాయిన్ అవుతుంది ప్రేమ. కాఫీ షాప్‌లో వెయిటర్‌గా ప్రేమని అలా చూసేసరికి షాక్ అయిపోతాడు ధీరజ్. వెంటనే ప్రేమను చేయిపట్టుకుని అక్కడ నుంచి తీసుకుని వచ్చేస్తాడు. అసలు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అని నిలదీస్తాడు.. మీ నాన్న గారు అన్న మాటల్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటావేమో.. నేను తీసుకోలేను’ అని తెగేసి చెప్తుంది ప్రేమ. బుద్దిలేకుండా మాట్లాడకు. ఇప్పటికే మా నాన్న మన వల్ల చాలామాటలు పడ్డారు. ఇప్పుడు రామరాజు గారి కోడలు కాఫీ షాప్‌లో పని చేస్తుందని తెలిస్తే ఆయన పరువేం కావాలి? మర్యాదగా చెప్తున్నా ఈ జాబ్ మానెయ్ అని అడుగుతాడు ధీరజ్. అయితే మొగుడు అడ్డెం అంటే పెళ్లం తెడ్డం అంటుంది కాబట్టి… సమస్యే లేదు.. నేను జాబ్ మానే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్తుంది ప్రేమ. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం.. నేను ఎవరి గురించి ఆలోచించను ఎవరు చెప్పినా జాబ్ మానేను నువ్వు జాబ్ చేసుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తాలే అనేసి ప్రేమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ ప్రేమ అన్నం తినడానికి రాకపోవడంతో రామరాజు భార్య బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×