BigTV English

Diwali Bonus : ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా బుల్లెట్ బైక్, కార్లు ఇస్తున్న కంపెనీలు ఇవే!

Diwali Bonus : భారతదేశంలో దసరా, దీపావళి పండుగల సమయంలో కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం సాంప్రదాయం. కొన్ని కంపెనీలు స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్ కానుకలు, షాపింగ్ కూపన్లు ఇస్తే మరికొన్ని నగదు రూపంలో ఇస్తాయి. కానీ వింతగా ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులకు బుల్లెట్ బైక్లను కానుకగా ఇచ్చాడు. మరొక కంపెనీ ఓనర్ అయితే ఏకంగా కార్లనే గిఫ్ట్‌గా ఇచ్చాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కోటగిరి నగరంలో ఉన్న ఒక టీ ఫార్మ్ యజమాని తన ఉద్యోగులతో పండుగ సంతోషం పంచుకునేందుకు వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్లను కానుకగా ఇచ్చాడు. మరోవైపు హర్యాణాలోని ఒక ఫార్మా కంపెనీ ఓనర్ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులలో బెస్ట పర్ఫార్మర్లను ఎంపిక చేసి 12 కార్లు గిఫ్ట్ చేశాడు.

తమిళనాడు కోటగిరిలో ఉన్న 190 ఎకరాల పెద్ద టీ తోట యజమాని శివకుమార్ గత సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు మిక్సీలు, కుక్కర్లు, నగదు కానుకలను ఇచ్చాడు. కానీ ఈ సారి శివకుమార్ తన ఉద్యోగులలో 15 మందికి బుల్లెట్ బండ్లను కొనిచ్చాడు. శివకుమార్ సంస్థలో మొత్తం 627 మంది ఉద్యోగులు ఉన్నారు.

మరోవైపు హర్యానాలోని పంచకులా ప్రాంతంలో ఉన్న మిటస్ హెల్త్‌కేర్ అనే మందుల కంపెనీ ఓనర్ తన కంపెనీలోని ఉద్యోగులలో బాగా పనిచేసిన 12 మందిని ఎంపిక చేసి వారికి కార్లను కానుక రూపంలో ఇచ్చింది. వచ్చే ఏడాది ఇలాగే 38 మందికి కార్లు ఇస్తామని కంపెనీ మెనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

కంపెనీ యజమానులు తమకు ఇలాంటి ఖరీదైన కానుకలు ఇవ్వడంతో ఉద్యోగులు డబుల్ పండుగ చేసుకుంటున్నారు. వారు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×