BigTV English

Cabinet Ministers: మోదీ క్యాబినెట్ లో ఆ రాష్ట్రానికే పెద్ద పీట..!

Cabinet Ministers: మోదీ క్యాబినెట్ లో ఆ రాష్ట్రానికే పెద్ద పీట..!

State Wise Cabinet Ministers: ప్రధాని మోదీ నూతన కేబినెట్‌లో బీజేపీకి 61, మిత్రపక్షాలకు 11  పదవులు దక్కాయి. రాష్ట్రాల వారిగా చూస్తే.. కేబినెట్‌లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు సర్కార్ పెద్ద పీట వేసింది. ఉత్తర ప్రదేశ్‌కు 9, బీహార్‌కు 8, మహారాష్ట్రకు 6 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. 72 మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది.


ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. ఎల్‌జేపీ, జేడీఎస్, శివసేన , రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ్, అప్రా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు రాష్ట్రాల వారిగా చూస్తే ..కేంద్ర కేబినెట్‌లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు సర్కార్ పెద్ద పీట వేసింది.

80 లోక్‌సభ స్థానాలున్న యూపీకి 9, బీహర్‌కు 8 కేంద్ర కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు ఐదేసీ మంత్రి పదవులు వరించాయి. హర్యానా, ఏపీ, తమిళనాడులకు మూడేసి..ఒడిశా, అస్సాం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బెంగాల్, కేరళకు రెండేసి కేంద్ర పదవులు దక్కాయి.


Also Read:  Odisha New CM: ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ.. ముఖ్యమంత్రి ప్రస్థానమిదే..!

రాష్ట్రాల వారిగా కేంద్రమంత్రులు:

  • ఉత్తర ప్రదేశ్ – బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మరో 8 మందికి కేంద్ర సహాయ మంత్రుల హోదా దక్కింది.
  • గుజరాత్ – అమిత్ షా, మన్‌సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్
  • బిహార్ – హిందుస్థాని అవామీ మోర్చా నుంచి జితన్‌రామ్ మాంఝీ, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్, జేడీయూ నుంచి రాజీవ్ సింగ్, ఎల్‌జేపీ నేత చారాగ్ పాసవాన్
  • మధ్యప్రదేశ్ – శివరాజ్ సింగ్ చౌహాన్ , జ్యోతిరాధిత్య సింథియా, వీరేంద్ర కుమార్
  • మహారాష్ట్ర – నితిన్ గట్కరీ, పీయూష్ గోయల్
  • తమిళనాడు – నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్, ఎస్ జైశంకర్
  • రాజస్థాన్ – భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, గజేంద్ర సింగ్ షెకావత్
  • ఒడిశా – ధర్మేంద్ర ప్రధాన్, జువల్ ఓరమ్
  • కర్ణాటక – హెచ్‌డీ కుమార స్వామి, ప్రహ్లాద్ జోషి
  • ఏపీ – రామ్మోహన్ నాయుడు
  • తెలంగాణ – గంగాపురం కిషన్ రెడ్డి
  • హర్యానా – మనోహర్ లాల్ ఖట్టర్
  • హిమాచల్ ప్రదేశ్ – జేపీ నడ్డా

Tags

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×