Domestic Violence Mother In law| గృహ హింస చట్టం కేవలం కోడళ్లక రక్షణ కోసమేనని అది అత్తలకు వర్తించదని ఓ కోడలు హై కోర్టులో వాదించింది. ఆమె వాదనను హై కోర్టు న్యాయమూర్తి కొట్టిపారేశారు. అత్తలకు కూడా గృహ హింస కేసు పేట్టే హక్కు ఉందని తెలిపుతూ ఆ మహా ఉత్తమరాలు కోడలికి షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పులో గృహ హింస నిరోధక చట్టం (డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్) కుటుంబంలోని ప్రతి మహిళకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ చట్టం కేవలం కోడళ్ల కోసం మాత్రమే రూపొందించబడినట్ల భావించకూడదని, అత్తలకు కూడా ఇది వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది.
ఒక మహిళ తన కోడలు తనను హింసిస్తుందంటూ గృహ హింస నుంచి రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ చేసేందుకు ట్రయల్ కోర్టు అంగీకరించింది. కానీ ఆ కోడలు మాత్రం ట్రయల్ కోర్టు ఈ కేసులో విచారణ చేయకూడదని తన అత్త పెట్టిన గృహ హింస కేసు వర్తించదని హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు, ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. కుటుంబంలోని ఏ మహిళ అయినా – అది అత్త అయినా, మరే ఇతర బంధువైనా – ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చని హైకోర్టు పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు న్యాయూమర్తి జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు మేజిస్ట్రేట్.. కోడలు, ఆమె కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేయగా.. కోడలు ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఆమె వాదస్తూ.. “గృహ హింస చట్టం కేవలం కోడళ్ల కోసం రూపొందిచారు. ఈ చట్టాన్ని అత్తకు వర్తింప చేయకూడదు” అని చెప్పింది.
ఈ వాదనను హైకోర్టు ఖండించింది. ట్రయల్ కోర్టు మేజిస్ట్రేట్ జారీ సమన్లను సరైనవిగా పేర్కొంటూ.. కోడలు వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తన తీర్పులో.. గృహ హింస చట్టం కేవలం కోడళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, కుటుంబంలో గృహ హింసకు గురయ్యే ప్రతి మహిళకూ వర్తిస్తుందని స్పష్టంగా తెలిపింది.
ఈ తీర్పులో.. హైకోర్టు డొమెస్టిక్ వయోలెన్స్ (Domestic Violence) యాక్ట్ లోని సెక్షన్ 12కి ప్రాధాన్యతనిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం.. కుటుంబంలో ఎవరైనా స్త్రీ – ఆమె అత్త అయినా, అక్కా అయినా, చెల్లెలైనా – గృహ హింసకు గురైతే, ఆమెకు ఈ చట్టం కింద రక్షణ పొందే హక్కు ఉంటుందని తెలియజేసింది.
కేసు వివరాలు..
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో నివసించే సుధా మిశ్రా అనే మహిళ కుమారుడితో గరిమ అనే యువతికి కొంత కాలం క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజుల తరువాత నుంచే గరిమ తన అత్తమామలకు దూరంగా ఉండాలని భర్తకు చెప్పడం ప్రారంభించింది. వేరుగా కాపురం పెట్టేందుకు గరిమ భర్త అంగీకరించలేదు. అలా కాకుంటే రాయ్ బరేలీ లోని తన పుట్టింటికి వెళ్లిపోదామని ఒత్తిడి చేసింది. కానీ అందుకే కూడా ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో గరిమ ఇంట్లో ఉన్న తన అత్త సుధా మిశ్రా వల్లే తన భర్త తాను కోరినట్లు చేయడం లేదని చెప్పి గొడవపడింది. అలా గొడవలు జరుగుతుండగా.. కోడలు గరిమ తన అత్తకు వ్యతిరేకంగా కట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు జరుగుతుండగా.. ఆమె తన భర్తను వదిలి పెట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత ఒకరోజు సుధా మిశ్రా ఇంటికి ఆమె కోడలు, కోడులు తరపు బంధువులు వచ్చి బలవంతంగా ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకెళ్లారు. దీంతో సుధా మిశ్రా తన కోడలికి వ్యతిరేకంగా గృహ హింస కేసు పెట్టింది.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
ట్రయల్ కోర్టు ఈ కేసుని విచారణకు స్వీకరించింది. కానీ ట్రయల్ కోర్టుకు వ్యతిరేకంగా గరిమ అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టులో తనకు వ్యతిరేకంగా విచారణ జరుగుతున్న గృహ హింస కేసు కొట్టివేయాలని పిటీషన్ వేసింది. కానీ హై కోర్టు మాత్రం ట్రయల్ కోర్టునే సమర్థించింది. గృహ హింస కేసు అత్తలకు వర్తించదని గరిమ వాదనను తప్పుబడుతూ ఇంట్లో ఉన్న మహిళలందరికీ ఇది వర్తిస్తుందని గృహ హింస నిర్వచనాన్ని వివరించింది.