E-Paper
Advertisement

‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!

‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!
Advertisement

Drishyam 3 Inspired Murder: సినిమాల్లో నేరస్థులు చేసే జిమ్మిక్కులను చూసి తాము కూడా పోలీసుల కంటపడకుండా నేరం చేయవచ్చని భావించేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా బిహార్ లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ‘దృశ్యం-3’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది పక్కా ప్లాన్ ప్రకారం తండ్రిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయితే అతడు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో చివరికి అడ్డంగా దొరికిపోయాడు.

అసలేం జరిగిందంటే?

బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా దర్వా గ్రామానికి చెందిన 50 ఏళ్ల రఘువీర్ సాహ్ని అనే వ్యక్తికి, ఆయన 26 ఏళ్ల కుమారుడు శివ్ శంకర్‌కు మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. శివ్ శంకర్ తన భార్యతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుటుంబ ఆస్తి  విషయంలో తండ్రీకొడుకుల మధ్య కొద్ది కాలంలో వివాదం కొనసాగుతోంది. దీనికి తోడు తండ్రి తనను, తన భార్యను దూషిస్తున్నాడనే కోపం కూడా శివ్ శంకర్‌లో కసిగా మారింది. దీంతో ఎలాగైనా తండ్రిని మట్టుబెట్టాలని అతను నిర్ణయించుకున్నాడు.

‘దృశ్యం-3’ ప్రేరణతో హత్యకు కుట్ర

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. తన పథకాన్ని అమలు చేయడానికి ముందు శివ్ శంకర్ సూరత్‌లోని ఒక థియేటర్‌లో ‘దృశ్యం-3’ సినిమా చూశాడు. ఈ సినిమాలో కథానాయకుడు పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ఒక నకిలీ టైమ్‌లైన్ సృష్టించడం, డిజిటల్ ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటం చూసి ప్రేరణ పొందాడు. ఈ క్రమంలోనే పోలీసులకు తన డిజిటల్ లొకేషన్ దొరకకూడదని భావించి సూరత్ నుండి ప్రయాణం ప్రారంభించే ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు.

సూరత్ నుంచి వచ్చి.. అర్ధరాత్రి దారుణం!

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రయాణమైన శివ్ శంకర్.. మొదట పట్నా చేరుకుని అక్కడి నుంచి హాజీపూర్ వెళ్లాడు. ఆ తర్వాత రైలులో పాటరీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆటో, నడక మార్గం ద్వారా దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి జూలై 26న అర్ధరాత్రి వేళ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంటి వెనుక తలుపు గుండా లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న గొడ్డలిని తీసుకున్నాడు. బయట నిద్రిస్తున్న తండ్రి రఘువీర్ సాహ్నిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం గొడ్డలిని అక్కడే వదిలేసి, తిరిగి పాటరీ రైల్వే స్టేషన్‌కు పారిపోయాడు.

ఒకే ఒక్క ఫోన్ కాల్.. ప్లాన్ రివర్స్!

Advertisement

ఇంతటి పక్కా స్కెచ్ వేసిన శివ్ శంకర్.. పాటరీ రైల్వే స్టేషన్ వద్ద ఒక చిన్న పొరపాటు చేశాడు. దాదాపు ప్రయాణమంతా స్విచ్ ఆఫ్ చేసి ఉంచిన ఫోన్‌ను ఒక్కసారిగా ఆన్ చేసి, తన భార్యకు ఒక చిన్న కాల్ చేసి మాట్లాడి మళ్లీ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాతి రోజుల్లో తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా తిరిగి సూరత్ చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలకు కొడుకు రాకపోవడంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది.

Also Read: దీపావళి స్పెషల్.. ఇంటికి గ్రాండ్ లుక్ ఇచ్చే.. చౌకైన ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్స్!

చివరికి ఎలా చిక్కాడంటే?

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్.. ఈ హత్య తెలిసినవారే చేసి ఉంటారని పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు టెక్నికల్ సర్వైలెన్స్ ప్రారంభించారు. హత్య జరిగిన రోజు శివ్ శంకర్ ఫోన్ పాటరీ వద్ద, ఆ తర్వాత 36 గంటల్లో సూరత్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఆయన కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించగా పాటరీ స్టేషన్ నుంచి భార్యతో మాట్లాడిన కాల్ బయటపడింది. దీంతో పోలీసులు సూరత్‌కు వెళ్లి శివ్ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను ‘దృశ్యం-3’ చూసే ఈ ప్లాన్ వేసినట్లు, తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Also Read: రష్యా ల్యాబ్‌లో బాక్టీరియా లీక్.. 28 ఏళ్ల ఉద్యోగిని మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ‘ప్లేగ్’ భయం!

Tags

Related News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

Big Stories

Advertisement
×