Diwali Lights: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ కాంతులతో మెరిసిపోవాల్సిందే. అయితే బాల్కనీలు, లివింగ్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లను రంగురంగుల లైట్లతో అలంకరించడానికి చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటార. ఈ నేపథ్యంలో జేబుకు చిల్లు పడకుండా రూ.500 లోపే లభించే అత్యుత్తమ ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్ల ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ – 2026’ సేల్‌లో ఇవి మరింత తక్కువ ధరకే లభించే అవకాశముంది. కాబట్టి వాటిపై ఓ లుక్కేయండి.
తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కోరుకునే వారు ఈ లైట్లను ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.299 కాగా ప్రస్తుతం 37% డిస్కౌంట్‌తో రూ.189 లకే అమెజాన్ లో అందుబాటులో ఉంది. 3 మీటర్ల పొడవైన రాగి వైర్‌పై 30 ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. అద్దాలు, షెల్ఫ్‌లు, మూలలు, చిన్న బాల్కనీలను అలంకరించడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
బ్రాండెడ్ లైట్లు కావాలనుకునే వారి కోసం ఫిలిప్స్ స్టార్‌లిట్ అందుబాటులో ఉంది. 12 మీటర్ల పొడవు ఉండే ఈ వైర్‌కి 72 ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. దీని ధర ప్రస్తుతం రూ. 289 గా ఉంది. ఇంటి ముందు, పెద్ద కిటికీలు, తలుపులు, విశాలమైన బాల్కనీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
మల్టీపుల్ కలర్ లైట్ల కంటే ప్రశాంతమైన ఒకే రంగును ట్రై చేయాలని భావిస్తే.. దీనిని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలోనే లభించే ఈ వార్మ్-వైట్ లైట్లు పండుగ వాతావరణానికి మరింత శోభను ఇస్తాయి. గోడలు, కిటికీలు, ఇంట్లోని ప్రధాన పూజా గదికి ఇవి సరిగ్గా సరిపోతాయి.
రంగురంగుల కాంతులతో పాటు వెరైటీ లుక్ కావాలనుకుంటే హుమైజార్ లైట్లను సెలక్ట్ చేసుకోవచ్చు. 5 మీటర్ల పొడవు ఉండే ఈ స్ట్రింగ్‌లో 50 ఎల్‌ఈడీలు అందించారు. దీని అసలు ధర రూ.499 కాగా ఆఫర్‌లో రూ.319 కే ఇస్తున్నారు. దీనికి రిమోట్ కంట్రోల్ తో యుఎస్‌బీ పవర్ సపోర్టును సైతం అందించారు. బెడ్‌రూమ్స్, బాల్కనీలు, పిల్లల గదులలో కలర్‌ఫుల్ డెకరేషన్ కోసం ఇది బాగా సెట్ అవుతుంది.
సాధారణ ఫెయిరీ లైట్ల కంటే భిన్నంగా గ్రాండ్ లుక్ కావాలనుకునే వారికి వన్94స్టోర్ స్టార్‌బర్స్ట్ లైట్స్ తప్పక నచ్చుతాయి. రూ.499 ధరకు లభించే ఈ 12 లైట్ల డిజైన్ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైనింగ్ ఏరియా, బాల్కనీ సెటప్, దీపావళి ఫోటో షూట్ కోసం దీనిని ట్రై చేయవచ్చు.
Also Read: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు