Chennai: ఉచిత బస్సుల పథకం ఏమోగానీ.. బస్సుల్లో కనిపిస్తున్న కొన్ని ఘటనలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా చెన్నై సిటీలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి, సిటీ బస్సులో నానాబీభత్సం సృష్టించింది. చివరకు ప్రయాణికులతో గొడవకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఇప్పుడేమో తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం దిగ్విజయంగా అమలు అవుతోంది. ఐదు రోజుల కిందట ఈ పథకాన్ని డీలక్స్ బస్సులకు విస్తరించారు తమిళనాడు సీఎం విజయ్. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మాదిరిగా ఇప్పుడు తమిళనాడు బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు.. ఓ యువతి చెన్నై సిటీ బస్సుల్లో నానా బీభత్సం సృష్టించింది.
చెన్నై సిటీలో బస్సులను ఎంటీఎస్ అంటారు. అచ్చ తెలుగులో మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌గా చెబుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. మంగళవారం తెల్లవారుజామున కోయంబేడు నుండి కిలంబాక్కం వెళ్తున్న MTC బస్సులో ఓ యువతి గందరగోళం సృష్టించింది. అశోక్‌నగర్ బస్ టెర్మినస్ సమీపంలో కదులుతున్న బస్సు డ్యాష్‌బోర్డ్‌పై కూర్చోవడం నుంచి ఆ యువతి రచ్చ మొదలైంది.
20 ఏళ్ల వయసున్న ఆ యువతి (వివరాలు వెల్లడించలేదు) చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని, డ్రైవర్- కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. బస్సు ముందు భాగంలోని డ్యాష్‌బోర్డ్‌పై కాళ్లు పెట్టుకుని కూర్చోవడం కనిపించింది. అంతేకాదు వారితో అసంబద్ధంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. ప్రయాణికుల సమాచారం ప్రకారం.. ఆ యువతి బస్సు సిబ్బందితోపాటు ప్రయాణికులపై వాదనకు దిగింది.
ALSO READ: ట్రైనింగ్ విమానానికి తప్పిన ముప్పు, పంట పొలాల్లో ల్యాండింగ్, కర్ణాటకలో ఘటన
అంతేకాదు అసభ్య పదజాలం ఉపయోగించింది. ఆమె ప్రవర్తనను ప్రశ్నించిన మరో మహిళా ప్రయాణికురాలితో గొడవకు దిగింది. ఆ యువతిని అదుపు చేయడం కష్టంగా మారడంతో బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్ని కోరారు ప్రయాణికులు. చివరకు రవాణా సిబ్బంది అశోక్‌నగర్ బస్ టెర్మినస్ వద్ద కుమరన్ నగర్ పోలీసులకు అప్పగించారు. యువతిని విచారించిన పోలీసులు, ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పించారు. తల్లిదండ్రులకు యువతి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఎవరికి తగినట్టు వారు రకకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మద్యం మత్తులో యువతి హంగామా..
చెన్నై OMR రోడ్డులో అర్ధరాత్రి MTC బస్సులో ఓ యువతి మద్యం మత్తులో హంగామా సృష్టించింది. సీటు విషయంలో మొదలైన గొడవతో తోటి ప్రయాణికులు, సిబ్బందిపై ఆమె దాడికి దిగింది. #Chennai #MTCBus #OMR #ViralVideo #TamilNadu #bigtv pic.twitter.com/jtQVlP60uS
— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2026