ICC New Rule : టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా… టి20 సిరీస్ లోనూ శుభారంభం చేసింది. లక్నో వేదికగా జరిగిన తొలి T20 లో 8 వికెట్ల తేడాతో బిగ్ విక్టరీ అందుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ లో చాలా వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐసీసీ కొత్తగా తీసుకువచ్చిన రూల్ టీమ్ ఇండియాకు అనుకూలించిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దానివల్లే టీమిండియా గెలిచిందని ప్రచారం చేస్తున్నారు. అలాగే రన్ అవుట్ తో పాటు ఓ క్యాచ్ కూడా టీమిండియా కు అనుకూలించడంతో… వెస్టిండీస్ చిత్తుగా ఓడిందని అంటున్నారు.
అమిత్ షా కుమారుడు జై షా చైర్మన్ గా ఉన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనేక రూల్స్ తీసుకువస్తుంది. అభిమానుల్లో ఆసక్తి నెలకొల్పేందుకు రకరకాల నిర్ణయాలు తీసుకుంటోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంతర్జాతీయ వన్డేలతో పాటు టి20 లలో కొత్త రూల్స్ తీసుకువచ్చింది ఐసీసీ. దీని ప్రకారం డ్రింక్స్ బ్రేక్ సమయంలో.. హెడ్ కోచ్ లేదా ఇతర సభ్యులు ఎవరైనా మైదానంలోకి ప్రవేశించి… కెప్టెన్ తో పాటు ఇతర ప్లేయర్లకు వ్యూహాలను పంచుకోవచ్చు. ఎలాంటి బౌలింగ్ చేయాలి? బ్యాటింగ్ సమయంలో ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అనే విషయాలను మైదానంలో చర్చించుకోవచ్చు.
అయితే గతంలో ఇలాంటి రూల్ లేదు. టీమిండియా సభ్యులలో రిజర్వు బెంచ్ వారు మాత్రమే మైదానంలోకి వెళ్లి డ్రింక్స్ అందించేవారు. వాళ్ల ద్వారా సమాచారం అందించేవారు. కానీ ఇప్పుడు నేరుగా హెడ్ కోచ్ కూడా వెళ్లే ఛాన్సులు కల్పించింది ఐసిసి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ కూడా ఈ రూల్ వినియోగించుకున్నాడు. టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ ను పిలిచి, అతని సలహాలు తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. భారీ స్కోర్ చేయాల్సిన వెస్టిండీస్… 171 పరుగులకే కుప్పకూలింది. అయితే దీనిపై వెస్టిండీస్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లక్నో వేదికగా జరిగిన తొలి T20 నేపథ్యంలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడకముందే… 171 పరుగులు చేసి కుప్పకూలింది. అయితే ఈ లక్ష్యాన్ని టీం ఇండియా కేవలం 14.4 ఓవర్లలో రెండంటే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ టి 20 సిరీస్ లో లీడింగ్ లోకి వెళ్ళింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన సెంచరీ, టీమిండియా కు కలిసి వచ్చింది.
?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==