BigTV English

Hemant Soren : సీఎం అరెస్ట్.. పదవి కోసం బయపడిన ఇంటిపోరు..

Hemant Soren : సీఎం అరెస్ట్.. పదవి కోసం బయపడిన ఇంటిపోరు..

Hemant Soren : కీలక పరిణామాల మధ్య బుధవారం రాత్రి ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన స్థానంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ను జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయనే కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతం కొంతకాలంగా ఆయన భూకుంభకోణం కేసులో హేమంత్ సోరేన్ మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


విచారణకు హాజరకుకావాలని వరుసగా ఈడీ నోటీసులు జారీ చేసింది. హేమంత్ సోరేన్ మెజారిటీ టైమ్స్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో.. నిన్న ఈడీ రాంచీలోని హేమంత్ సోరేన్ ఇంటికి వెళ్లి 7 గంటలకు పైగా విచారించారు. బుధవారం ఝార్ఖండ్ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈడీ హేమంత్ సోరేన్ ఇంటికి వెళ్లింది. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసింది. దీంతో.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

7 గంటలకుపైగా ప్రశ్నించిన ఈడీ.. హేమంత్ సోరేన్‌ను మొత్తం 15 ప్రశ్నలు వేశారు. అయితే.. ఆయన సమాధానం చెప్పలేదని తెలిసింది. దీంతో ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి మొదట హేమంత్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయానికి వెళ్లిన తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత హేమంత్ సోరేన్ రాజీనామా లేఖను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు పంపించారు. వెంటనే గర్నవర్ రాజీనామా లేఖను ఆమోదించారు.


సోరెన్‌ అరెస్ట్‌తో ఆయన కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. మొదట హేమంత్‌ సోరేన్ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా ఎన్నుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. అయితే.. దీనికి సంబంధించి ప్రయత్నాలు కూడా జరిగిగాయి. కానీ హేమంత్ సోరేన్ వదిన.. సీతా సోరెన్‌ బహిరంగంగానే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కల్పనా సోరేన్‌కు ఎమ్మెల్యేగా అనుభవం లేదు.. ఎలాంటి రాజకీయ అనుభవమూ లేదు.. అలాంటి వ్యక్తిని ఎలా సీఎంగా చేస్తారని అడ్డుకున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా అవకాశం ఇవ్వాలనుకుంటే.. తాను 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా కనుక.. తననే ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ చేశారు. దీంతో.. చేసేదేమీ లేక పార్టీ సీనియర్ నేత చంపయీ సోరెన్‌ను సంకీర్ణ సభా పక్షనేతగా ఎన్నుకున్నారు.

ఈడీ విచారణ, అరెస్టును హేమంత్ సోరేన్ ఖండించారు. అరెస్ట్ జరిగినంత మాత్రానా తప్పు చేసినట్టు కాదని ట్వీట్ చేశారు. ఈ అరెస్ట్ ను అంగీకరించబోనని.. దుర్మార్గపు రాజకీయాలపై పోరాడుతూనే ఉంటానని హేమంత్ సోరేన్ ట్వీట్ చేశారు. ఇక హేమంత్ సోరేన్‌ అరెస్ట్ ను ఇండియా కూటమి వ్యతిరేకించింది. హేమంత్‌తో రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి బీజేపీ.. ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగిస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని బీజేపీ కామెంట్ చేసింది. లాలూ ప్రసాద్‌, సోరెన్‌, సోనియాలను అరెస్టు చేయాలని గతంలో డిమాండ్ చేసిన కేజ్రీవాల్‌ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

.

.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×