Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎదురు కాల్పలు జరిగినప్పుడు 30 మంది మావోయిస్టులన మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులను ఎక్కడికక్కడ కాల్చి చంపుతున్నారు. దీంతో గడిచిన 3 నెలల్లోనే 100 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.
ఇక శుక్రవారం తెల్లవారుజాము నుంచే సుక్మా జిల్లాలో కాల్పుల మోత మోగుతోంది. అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఉదయం గోగుండ కొండల ప్రాంతంలో జిరిగిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఉపంపల్లి దగ్గర జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎదురుకాల్పులు జరిపిన చోట భారీగా ఆయుధాలను స్వాధీనం చేసకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.