BigTV English

Exit Polls 2024 : మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికల్లో గెలువబోయే పార్టీలు ఇవే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల

Exit Polls 2024 : మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికల్లో గెలువబోయే పార్టీలు ఇవే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల

Exit Polls 2024 : జార్ఘండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో.. చాలా ఆసక్తికర ఫలితాలు వెలువడతాయని తెలిపిన సర్వే సంస్థలు, పార్టీలు, కూటముల వారీగా అంచనాలను వెలువరించాయి. వివిధ సంస్థలు అందించిన అంచనాల ప్రకారం..


మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరగగా.. మెజార్టీ మార్క్ 145 స్థానాలుగా ఉంది.

పీ – మార్క్ అంచనాలు
మహాయుతి కూటమి : 137 – 157 సీట్లు
మహా వికాస్ అఘాడీ : 126 – 146 సీట్లు
ఇతరులకు                 : 02 – 08 సీట్లు


మ్యాట్రిజ్ అంచనాలు
మహాయుతి కూటమి : 150 – 170 సీట్లు
మహా వికాస్ అఘాడీ : 110 – 130 సీట్లు
ఇతరులకు                 : 8 – 10 సీట్లు

న్యూస్ 18 అంచనాలు
మహాయుతి కూటమి : 154 సీట్లు
మహా వికాస్ అఘాడీ : 128 సీట్లు
ఇతరులకు                 : 06 సీట్లు

చాణక్య స్ట్రాటజీస్
మహాయుతి కూటమి : 152 – 160 సీట్లు
మహా వికాస్ అఘాడీ : 130 – 138 సీట్లు
ఇతరులకు                 : 06 – 08 సీట్లు

పీపల్స్ పల్స్
మహాయుతి కూటమి : 182 సీట్లు
మహా వికాస్ అఘాడీ : 97 సీట్లు
ఇతరులకు                 : 00 సీట్లు

మహారాష్ట్ర ఎన్నికలపై వివిధ సంస్థలు వెలువరించిన ఫలితాల్ని బట్టి మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని వెల్లడైంది. దీంతో.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయో కూటమికి మళ్లీ అధికారం దక్కుందనే అభిప్రాయం అన్ని సర్వేల్లోనూ వ్యక్తమయ్యింది.

ఇక.. జార్ఘండ్ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వెలువరించిన పలు సంస్థలు.. పార్టీలు, కూటమి వారీగా అంచనాల్ని విడుదల చేశారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా 42 సీట్లు మెజార్టీ మార్కుగా ఉన్నాయి.

పీ – మార్క్ అంచనాలు
బీజేపీ కూటమి : 31 – 40 సీట్లు
కాంగ్రెస్ కూటమి : 37 – 47 సీట్లు
ఇతరులు : 01 – 06 సీట్లు

మ్యాట్రిజ్ అంచనాలు

బీజేపీ కూటమి : 45 సీట్లు
కాంగ్రెస్ కూటమి : 32 సీట్లు
ఇతరులు : 04 సీట్లు

పీపుల్స్ పల్స్ 
బీజేపీ కూటమి : 45 సీట్లు
కాంగ్రెస్ కూటమి : 30 సీట్లు
ఇతరులు : 08 సీట్లు

చాణక్య స్ట్రాటజీస్ 
బీజేపీ కూటమి : 45 – 50 సీట్లు
కాంగ్రెస్ కూటమి : 35 – 38 సీట్లు
ఇతరులు : 00 సీట్లు

అనేక రాజకీయ పరిణామాల  మధ్య జరిగిన ఝార్ఘండ్ ఎన్నికలపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ అధికారంలో ఉన్న  జార్ఘండ్ ముక్తి మోర్చ పార్టీని గద్దె దించి.. భాజపా కూటమి అధికారాన్ని దక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్థలు అంచనాలు వెలువరించాయి.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×