BigTV English

Bigg Boss 8 Telugu Promo: నబీల్‌పై కంటెస్టెంట్స్ పగ.. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా ఏంటా ఆటలు?

Bigg Boss 8 Telugu Promo: నబీల్‌పై కంటెస్టెంట్స్ పగ.. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా ఏంటా ఆటలు?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలయినప్పటి నుండి చీఫ్ అనే స్థానం కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ కలిసి చీఫ్ స్థానం కోసం పోటీపడ్డారు. అలా మెగా చీఫ్ అనే పదవి పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ అంతా మెగా చీఫ్ అవ్వడం కోసం ఎన్నో టాస్కులు ఆడారు. దెబ్బలు తగిలించుకున్నారు. పాత కంటెస్టెంట్స్‌లో విష్ణుప్రియా, పృథ్వి తప్పా అందరూ చీఫ్ పదవి ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇక ఈ సీజన్‌లో చివరిసారిగా మెగా చీఫ్ కోసం పోటీ మొదలయ్యింది. అందులో కంటెస్టెంట్స్ అంతా కలిసి నబీల్‌ను వెనక్కి తోసే ప్రయత్నం చేశారు.


అవినాష్ అవ్వొద్దు

బిగ్ బాస్ 8లో చివరి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడం కోసం సమయానుసారం కంటెస్టెంట్స్ పేరు మీద హౌస్ లోపలికి వచ్చే టీషర్ట్స్‌ను కాపాడుకోవాలి. ఆ టీషర్ట్‌ను కాపాడుకోవడానికి ఆ కంటెస్టెంట్‌తో పాటు తనకు సపోర్ట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్ కూడా ప్రయత్నించవచ్చు. అలా తాజాగా విడుదలయిన ప్రోమోలో ముందుగా అవినాష్ టీషర్ట్ హౌస్‌లోకి వచ్చింది. అవినాష్ ఇప్పటికే రెండుసార్లు మెగా చీఫ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేశాడు. అందుకే తను మరోసారి మెగా చీఫ్ అవ్వడం నిఖిల్‌కు ఇష్టం లేదు. అందుకే దాన్ని చించేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత యష్మీ టీషర్ట్ హౌస్ లోపలికి వచ్చింది. తన టీషర్ట్‌ను కాపాడుకోవడం కోసం ప్రేరణ కూడా రంగంలోకి దిగింది.


Also Read: తేజ చెంపపై యష్మీ ముద్దు.. అందరూ కలిసి ఎంత మోసం చేశార్రా!

నబీల్ టార్గెట్

యష్మీ, ప్రేరణ, గౌతమ్ కలిసి టీషర్ట్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా మిగతా కంటెస్టెంట్స్ అంతా దాన్ని చించేయాలని అనుకున్నారు. మొత్తానికి ఈ ఆటలో అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా టీషర్ట్ కోసం కొట్టుకునే వరకు వెళ్లారు. అయినా బిగ్ బాస్ 8లో ఇలా కొట్టుకుంటూ టాస్కులు ఆడడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆ తర్వాత నబీల్ టీషర్ట్ వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో పడింది. నిఖిల్ పూల్‌లోకి దూకి దాన్ని చింపడం మొదలుపెట్టాడు. నబీల్ దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా తను కదలకుండా లాక్ చేసేశాడు గౌతమ్. దీంతో నబీల్ టీషర్ట్ పూర్తిగా చిరిగిపోయింది. కానీ ఎవ్వరినీ ఏమనకుండా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్లిపోయాడు.

నబీల్ సపోర్ట్

‘‘థాంక్యూ నిఖిల్, ప్రేరణ, గౌతమ్, రోహిణి’’ అంటూ ఎవరూ లేనప్పుడు తను ఓడిపోవడానికి కారణమయిన వారికి వ్యంగ్యంగా థ్యాంక్స్ చెప్పాడు నబీల్. ఆ తర్వాత విష్ణుప్రియా టీషర్ట్ లోపలికి వచ్చింది. అసలు తనకు ఎవరూ సపోర్ట్ చేయరని విష్ణుప్రియా ఫిక్స్ అయిపోయింది. కానీ అనూహ్యంగా ఎలాగైనా తన టీషర్ట్ కాపాడాలని నబీల్ రంగంలోకి దిగాడు. స్విమ్మింగ్ పూల్‌లో దూకి మరీ.. ఆ టీషర్ట్‌ను కాపాడాడు. అలా విష్ణుప్రియా కూడా మెగా చీఫ్ కంటెండర్ అయ్యిందని ప్రోమో పూర్తయ్యే లోపు ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలు చూస్తుంటే టేస్టీ తేజ, విష్ణుప్రియా మెగా చీఫ్ కంటెండర్లు అయినట్టు తెలుస్తోంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×