BigTV English

Exit Polls: బీజేపీ తగ్గేదేలే.. ఆప్ ఆగమాగం.. కాంగ్రెస్?.. ఎగ్జిట్ పోల్స్

Exit Polls: బీజేపీ తగ్గేదేలే.. ఆప్ ఆగమాగం.. కాంగ్రెస్?.. ఎగ్జిట్ పోల్స్

Exit Polls: ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిచింది. సుదీర్ఘకాలంగా గుజరాత్ ను పరిపాలిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.. ఈసారి ఏం గెలుస్తుందిలే అనుకున్నారు కొందరు. మార్పు మంచికేనంటూ ఆప్ అడుగుపెట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనంటూ పోలింగ్ కు ముందే పేపర్ మీద రాసిచ్చేశారు కేజ్రీవాల్. ఇక, కాంగ్రెస్ సైతం ఈసారి గట్టి పోటీ ఇస్తామంది. ఇలా కొంతకాలంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్.. పోలింగ్ ముగిసే సరికి గెలుపెవరిదో తేలిపోయింది.


ఆరోసారి కూడా బీజేపీదే అధికారమంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక్కమాట మీద నిలిచాయి. మోదీ ఇమేజ్ కమలానికి భారీగా ఓట్లు తెచ్చిపెట్టబోతోంది. ఎంతో హడావుడి చేసిన ఆప్ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే, గుజరాత్ లో ఎప్పటిలానే అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం బీజేపీతో హోరాహోరీగా తలపడిందని తెలుస్తోంది.

గుజరాత్‌ మళ్లీ బీజేపీదే..
పీపుల్స్‌ పల్స్‌ సర్వే: బీజేపీ 125 -143; కాంగ్రెస్‌ 30-48; ఆప్‌ 3-7; ఇతరులు 2-6
న్యూస్‌ ఎక్స్‌ సర్వే: బీజేపీ 117 -140, కాంగ్రెస్‌ 34-51, ఆప్‌ 6-13
ఆత్మసాక్షి: బీజేపీ 98-110; కాంగ్రెస్‌ 66-110; ఆప్‌ 9-14
ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌: బీజేపీ 130-145; కాంగ్రెస్‌ 25-35; ఆప్‌ 5-7


హిమాచల్‌లో హోరా హోరీ..
రిపబ్లిక్ టీవీ పి-ఎంఏఆర్‌క్యూ: బీజేపీ 34 -39; కాంగ్రెస్‌ 28-33, ఆప్‌ 0-1
న్యూస్‌ ఎక్స్‌: బీజేపీ 32-40, కాంగ్రెస్‌ 27-34, ఆప్‌ 0
టైమ్స్‌ నౌ-ఈటీజీ: బీజేపీ 38, కాంగ్రెస్‌ 28, ఆప్‌ 0

గుజరాత్‌లో మొత్తం 182 సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు నవంబర్‌ 12న ఒకేసారి పోలింగ్‌ నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కడుతుండగా.. డిసెంబర్‌ 8న అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×