BigTV English

Delhi Farmers Demands: ఢిల్లీలో రైతన్నలు లేవనెత్తిన డిమాండ్లు ఇవే..!

Delhi Farmers Demands: ఢిల్లీలో రైతన్నలు లేవనెత్తిన డిమాండ్లు ఇవే..!

Farmers are demanding to solve their problems: రెండేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలో గొప్ప ఉద్యమాన్ని తలపెట్టిన రైతులు.. ప్రస్తుతం మరోసారి తమ డిమాండ్లతో రోడ్డెక్కారు. గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గొంతు విప్పిన రైతన్నల ధాటికి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల విషయంలో వెనకడుగు వేసింది.


అయితే.. అనాదిగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కోరుతున్న కొత్త డిమాండ్లతో ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న ‘దిల్లీ మార్చ్’కి పిలుపునివ్వటమే గాక ఫిబ్రవరి 16న ఒకరోజు గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

దీంతో కేంద్రం రైతు సంఘాలతో నేడు జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవటంతో రైతులు తమ సంఘర్షణను తీవ్రతరం చేయనున్నారు. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే భయంతో కేంద్రం ఎక్కడికక్కడ రైతులు ఢిల్లీకి రాకుండా చర్యలు తీసుకోవటమే గాక.. ఇప్పటికే ఢిల్లీ శివారుకు చేరిన రైతులను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకూ ఢిల్లీలో ధర్నాలకు దిగిన రైతన్నలు కోరుతున్న డిమాండ్లేమిటో ఓసారి తెలుసుకుందాం.


Read More: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదే లేదంటున్న రైతులు

ప్రధాన డిమాండ్లు..
అభివృద్ధి పేరుతో రైతులు భూములు సేకరిస్తే.. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ప్రస్తుతమున్న దానికంటే.. నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి.

వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి.. 200 రోజులకు పని దినాలను పెంచాలి, రోజువారీ కూలి రూ. 700 ఇవ్వాలి.

ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఘటనకు కారణమైన వ్యక్తులను శిక్షించాలి. అలాగే నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి.

గతంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసు మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలి.

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అన్ని పంటరుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలి.

మిరప, పసుపు వంటి పలు రకాల సుగంధ పంటలకు సంబంధించి వెంటనే జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.

రెండేళ్ల నాడు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలి.

WTOతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి.

విద్యుత్ పంపిణీని ప్రైవేటు సంస్థలక అప్పగించేలా అవకాశం కల్పిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు, రైతు కూలీలకు నిర్ణీత పింఛనును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి.

నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించేందుకు కేంద్రం పూనుకోవాలి.

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×