BigTV English

Raj Kumar Singh: ఆడపిల్లే శాపం అనుకునే వాళ్లకి ఈ తండ్రి స్పూర్తి!

Raj Kumar Singh: ఆడపిల్లే శాపం అనుకునే వాళ్లకి ఈ తండ్రి స్పూర్తి!
Advertisement
Story About Father

A Father Inspirational Story: టెక్నాలజీ పెరిగి ఎంతో ముందుకి వెళుతున్నప్పటికీ.. లింగ వివక్షత మాత్రం అలానే ఉంది. మహిళలు కూడా తాము ఎందులోనూ తీసిపోము అన్నట్లు మగవాళ్లకు ధీటుగా ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే చాలా మంది తల్లి దండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. వారసుడిగా కొడుకుకి ఉన్నంత ఆదరణ కూతుళ్లకి ఎందుకు ఉండదనేది ఒక చిక్కు ప్రశ్న. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న తల్లి దండ్రులంటే సమాజం సైతం తెగ జాలి చూపిస్తోంది.


అమ్మో!ఇద్దరు ఆడపిల్లలే !.. అంటూ పదే పదే గుర్తు చేస్తూ ఆయా తల్లి దండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో తాము కన్నది ఆడపిల్లలు కదా ! అని భయంగా జీవితాన్ని గడుపుతుంటారు. కాని ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే కాదు, శభాష్ ఇలా పెంచాలి ఆడపిల్లని అని అందరిచేత ప్రశంశలు అందుకున్నాడు. ఈ తండ్రి గాథ కచ్చింతంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, గొప్ప మార్పు తెస్తుంది.

వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని సరన్ జిల్లాకు చందిన రాజ్ కుమార్ సింగ్ పిండి మిల్లు కార్మికుడు. ఈయన కూడా అందరి లాగా వారసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి మహాలక్ష్మి పుట్టిందనుకున్నాడు. ఆ తర్వాత రెండవ కాన్పులో వారసుడు పుడతాడని కొండంత ఆశతో ఎదురు చూసాడు కానీ.. మళ్లీ ఆడపిల్లే జన్మించింది.


Read More: అయోధ్యకు 3 కొత్త రహదారులు..

అయినప్పటికి రాజ్ కుమార్ సింగ్ బాధపడలేదు. ఇలా ఏడుగురిని పిల్లల్ని కన్నాడు. కానీ అందరూ ఆడపిల్లలే పుట్టారు. అయితే ఏంటి ? వారిని శివంగుల్లా పెంచాడు. అందరిలా ఇతను కూడా కూతుళ్లకి ఓ వయసు వచ్చినాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు. తాను తమ తాహతకు మించి ఏడుగురినీ చదివించాడు. అయితే ఇరుగు పొరుగు వారు కూతుళ్ల పెళ్లిళ్ల గురించి రాజ్ సింగ్ ని గుర్తు చేస్తూ భయపెడుతూనే ఉండేవారు.

కానీ ఆ తండ్రి మాత్రం వాళ్ల కాళ్లమీద నిలబడేలా పెంచితే చాలు అన్న సూత్రాన్ని నమ్మాడు. అది నిజమయ్యేలా చేసారు ఆ ఏడుగురు పిల్లలు కూడా.. వారంతా పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుని తండ్రి కలల్ని నిజం చేసారు. ఇక పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హాని ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తుంది.

మూడవ కూతురు సోని సీఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా చేస్తుంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో చేస్తుంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.

ఇలా ఏడుగురు కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం. ఇన్నాళ్లు రాజ్ కుమార్ ని ఆడపిల్లలు అని భయపెట్టే ఇరుగు పొరుగు వారంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆడపిల్లే శాపం అనుకునే వాళ్లకి ఈ కథే సమాధానమిస్తుంది.

Tags

Related News

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Goa: తీవ్ర విషాదం.. గోవా మాజీ సీఎం కన్నుమూత

PM Shram Yogi Maan Dhan scheme: రూ.55 చెలిస్తే చాలు.. ప్రతీ నెలా 3 వేల రూపాయలు, ఆ పథకం వివరాలేంటి?

Big Stories

×