BigTV English

Jawaharnagar mayor: జవహర్‌నగర్‌ కార్పొరేషన్.. మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం..

Jawaharnagar mayor: జవహర్‌నగర్‌ కార్పొరేషన్.. మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం..

No Confidence Motion On Jawaharnagar Mayor(Hyderabad latest news): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ మేయర్‌ పై అసమ్మతి వర్గం పెట్టిన అవిశ్వాసం తీర్మానం గెలిచింది. దీంతో మేయర్ మేకల కావ్యపై పదవి నుంచి దిగిపోయారు. జవహర్‌ నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్‌ సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. 20 మంది సభ్యులు మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం వివరాలను ఆర్డీవో అధికారికంగా ప్రకటించారు.


Read More: మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య.. ఏం జరిగింది?

అవిశ్వాస తీర్మానం సమయంలో జవహర్ నగర్ లో రాజకీయం వేడెక్కింది. అసమ్మతి వర్గం 20 మంది కార్పొరేటర్లు స్పెషల్ వాహనంలో అవిశ్వాస తీర్మాన పరీక్షకు హాజరయ్యారు. కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ అవిశ్వాస తీర్మానంపై‌ ఓటింగ్‌ చేపట్టారు. మొత్తం జవహర్ నగర్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేట్లు ఉన్నారు. కానీ అనారోగ్యంతో 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరణించారు. దీంతో మిగిలిన 27 మందితో ఓటింగ్ నిర్వహించారు. అందుకే 20 మంది మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చారు. 20 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ఆర్డీవో వెంకట ఉపేందర్ ప్రకటించారు.ఈ వివరాలను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు.


అవిశ్వాస తీర్మానం వేళ జవహర్‌నగర్‌ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పదవి కోల్పోవడంతో కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి మేయర్‌ కావ్య వెళ్లిపోయారు. తనపై కారణంలేకుండానే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆరోపించారు. తమ స్వలాభం కోసం కొందరు కార్పొరేటర్లు ఈ పని చేశారని విమర్శించారు.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×