BigTV English

OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

OG : కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది ప్రేక్షకులు ఎప్పుడు నుంచి ఎదురుచూస్తున్న సినిమా ఓజి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకాలు పెంచుకున్నారు. అలా పెంచుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే స్వతహాగా ఈ సినిమాని తీస్తున్న దర్శకుడు సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని.


పదేళ్లు తర్వాత గబ్బర్ సింగ్ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టినప్పుడు, పవర్ స్టార్ అని అరిచే చాలామంది అభిమానులలో సుజీత్ కూడా ఒకరు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అని అనౌన్స్ చేసినప్పుడు ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఖచ్చితంగా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని అందరికీ ఒక అంచనా వచ్చేసింది.

ఏం ప్లాన్ చేసావ్ సుజీత్ 

ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవ్వబోతుంది ఎవరికీ క్లారిటీ లేదు. కానీ సినిమా సక్సెస్ అవుతుంది అని అందరికీ విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన వీడియో మరింత హైట్ పెంచింది. ఇమ్రాన్ హష్మీ ఓమి అనే పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. రిలీజ్ చేసిన వీడియోలో హ్యాపీ బర్తడే ఓ జి అంటూ ఇమ్రాన్ హష్మీ చెప్పాడు.


అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ డియర్ ఓమి అంటూ మొదలయ్యే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పే వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వాయిస్ వినగానే గూసుబుమ్స్ వస్తున్నాయి. అసలు సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఏం ప్లాన్ చేశాడు అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏదేమైనా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే అదే హ్యాపీ.

థియేటర్లో శవాలు లేస్తాయి 

ఈ మధ్యకాలంలో భాష కంప్లీట్ గా మారిపోయింది. ట్విట్టర్లో కొంతమంది కొన్ని కొత్త కొత్త పదాలను కనిపెట్టారు. చాలామంది సినిమాకి ఎలివేషన్ ఇస్తూ.. కలెక్ట్ మై బాడీ అట్ సంధ్య థియేటర్ అని కామెంట్స్ కూడా చేస్తుంటారు. హైప్ కి పోయేలా ఉన్నాం అని కొంతమంది ట్విట్టర్లో పోస్ట్లు పెడుతుంటారు. అవి వినడానికి ఫన్నీగా అనిపించినా కొన్నిసార్లు నిజం అవుతాయి కూడా, ఈ సినిమా మీద మాత్రం ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అవి నిలబెట్టుకుని సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ అసలైన స్టామినా ఏంటో మరోసారి రుజువు అవుతుంది.

Related News

OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు.. ఇక ఆపేయండి అంటూ ఆవేదన

Sharwanand: మరి పేషంట్ లా మారిపోతున్నారు ఏంటి సార్?

Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌.. ప్రముఖ జర్నలిస్ట్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌లో మంచు లక్ష్మి ఫిర్యాదు

VK Naresh: మళ్లీ పవిత్ర పేరు తీసుకొచ్చిన నరేష్.. ఆ ప్రేమ గుర్తొచ్చింది

K-Ramp Teaser Review : కంటెంట్ వదిలేసి మళ్లీ బిల్డప్ ను నమ్ముకున్నాడా?

Big Stories

×