BigTV English

Shibu Soren: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ

Shibu Soren: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ

JMM Chief Shibu Soren is Worried: ప్రస్తుతం జార్ఖండ్ లో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ కోడళ్ల రాజకీయ విషయమై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. రాజకీయ పరంగా తదుపరి సమయంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారు..? కుటుంబ పెద్ద ఎవరికి మద్దతు ఇస్తారు..? చిన్న కోడలుకా..? లేక పెద్ద కోడలుకా? అనే చర్చ బలంగా సాగుతోంది. అయితే, జార్ఖండ్ రాజకీయాల్లో శిబు సోరెన్ చాలా సీనియర్ ఆయనకు అక్కడ మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన జేఎంఎం చీఫ్ గా కొనసాగుతున్నారు. అయితే, ఆయన ఇంటిపోరుతో సతమతమవుతున్నారంటా.


అయితే, 1952లో జార్ఖండ్ లోని దుమ్కా నియోజకవర్గానికి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన పాల్ జుజార్ సోరెన్ గెలిచారు. అప్పటి నుంచి ఈ లోక్ సభ స్థానానికి జరిగిన 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. ఈ నియోజకవర్గంలో 10 లక్షలకుపైగా ఓటర్లు ఉంటారు. ఎస్సీ కేటగిరీకి చెందిన జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీకి చెందిన జనాభా 37.39 శాతం ఉంటుంది. చాలామంది ఓటర్లు గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. మిగిలినవారు నగరాల్లో ఉంటారు. గత నాలుగు దశాబ్ధాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. జేఎంఎం అధ్యక్షుడు శిబు సోరెన్ ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. శిబు సోరెన్ పేరు గతంలో కంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన గురించే చర్చ కొనసాగుతోంది.

దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బరిలో నిలబడ్డారు. అప్పటి నుంచి ఆమె జేఎంఎంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జేఎంఎం ఈ స్థానానికి తన కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కానీ, పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను మాత్రం చిన్నకోడలు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె బీజేపీపై ఫైర్ అయ్యింది. రాజకీయపరంగా తమ కుటుంబంలో బీజేపీ చిచ్చుపెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను కావాలనే బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని, అందులో భాగంగానే హేమంత్ సోరెన్ ను జైలుకు పంపారంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో స్థానికంగా రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటు చిన్న కోడలు.. అటు పెద్ద కోడలు వ్యాఖ్యలు చేస్తున్నారు.


Also Read: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. కార్లు కడిగితే రూ.2 వేలు ఫైన్

ఈ నేపథ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే చర్చ స్థానికంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన మనోవేదనకు గురవుతున్నారంటా. ఓ వైపు పార్టీ.. మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారంటూ స్థానికంగా చర్చ కొనసాగుతోందంటా.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×