Maha Kumbhamela: ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 18లోని శంకరాచార్య మార్గ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
కాగా ఉత్తర ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవల రెండుసార్లు భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సర్కారు 22లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో టెంట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మరువక ముందే మరోసారి కుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగింది.
సెక్టార్ 18లోని శంకరాచార్య మార్గ్‌లో మంటలు చెలరేగాయి. ఇక వెంటనే అప్రమత్తమయిన భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంధి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే మరోసారి అగ్నిప్రమాదం జరగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాధువులు, సన్యాసులు, అఘోరాలే కాదు.. ఎలాంటి ఆహ్వానం లేకుండానే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది సాధారణ భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక ఉత్సవం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా.. 45 రోజుల పాటు పుణ్య స్నానాలతో.. త్రివేణి సంగమం అత్యంత వైభవోవేతంగా వెలిగిపోతుంది. అశేష జనవాహినితో, భగవన్నామ స్మరణలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది ప్రయాగ. గంగ, యమున, సరస్వతి కలిసే.. పవిత్ర త్రివేణి సంగమస్థలిలో.. మహా కుంభమేళాకు భక్తిపారవశ్యంతో భక్తజనకోటి పోటెత్తింది. ఇది.. 12 ఏళ్లకోసారి ప్రయాగలో కనిపించే పూర్ణ కుంభమేళా వైభవం మాత్రమే కాదు.. అంతకుమించిన ఆధ్యాత్మిక మేళా. 144 ఏళ్లకోసారి వచ్చే.. మహోన్నతమైన ఆధ్యాత్మిక మహోత్సవం. ఈ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే.. సకల పాపాలు తొలగి.. పునీతులవుతారనేది భక్తుల నమ్మకం.
Also Read: ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు బిజేపీ ఆఫర్.. ఓటమి భయంతోనే ఇదంతా
దేశం మొత్తం ఇప్పుడు మహా కుంభమేళా వైపే చూస్తోంది. పుష్య పూర్ణిమ నుంచే మొదటి రాజస్నానం ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాదిలో మంగళవారం తెల్లవారుజాము 4 గంటల వరకు పుష్య పూర్ణిమ ఘడియలే ఉంటాయ్. సూర్యోదయ తిథిని అనుసరించి.. మహా కుంభమేళాలో పరమ పవిత్రమైన పుష్య పౌర్ణమి రోజున తొలి రాజస్నానం ఆచరిస్తారు. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది.
సాధారణంగా నాలుగేళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఓ విశిష్టత ఉంది. ఇది.. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాలు, అమరికల వల్ల జరుగుతున్న అరుదైన కుంభమేళాగా పండితులు చెబుతున్నారు. ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికే.. ఈ మహా కుంభమేళా చూసే అదృష్టం దక్కుతుంది. అందుకోసమే.. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, సాంస్కృతిక ఉత్సవంగా.. మహా కుంభమేళా రికార్డులకెక్కింది. అలాంటి చోట ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరగడం హాట్ టాపిక్‌గా మారింది.
Big fire again in Sector 18, #Mahakumbh #Prayagraj…. pic.twitter.com/74ADumZaY3
— Priya Gupta (@priyagupta999) February 7, 2025