Sai Pallavi.. నేచురల్ స్టార్ గా, లేడీ పవర్ స్టార్ గా పేరు దక్కించుకుంది సాయి పల్లవి(Sai Pallavi). గత ఏడాది అమరన్ (Amaran) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని.. తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తాజాగా తండేల్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి (Sai Pallavi), నాగచైతన్య (Naga Chaitanya) సందడి చేశారు. ఇక అందులో భాగంగానే సాయి పల్లవి తనకు ఆరోగ్యం బాగో లేకపోయినా కూడా ప్రమోషన్స్ చేసింది. ఇదిలా ఉండగా నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ముఖ్యంగా నెటిజన్లు వేసిన కొన్ని ప్రశ్నలను కూడా ఈ ఇంటర్వ్యూలో వారు అడగడం జరిగింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి అలవాట్లు ఏంటి? ఆమె ఇష్టంగా తినే ఆహారం ఏంటి? ఖాళీ సమయంలో ఏం చేస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను సాయి పల్లవిని నాగచైతన్య ప్రశ్నించగా.. ఆమె అన్నింటికీ ఓపికగా సమాధానం తెలిపింది.
వైరల్ గా మారిన సాయి పల్లవి అలవాట్లు..
సాయి పల్లవి మాట్లాడుతూ.. “నాకు బన్ మస్కా అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సుమారుగా ఐదు లీటర్ల కొబ్బరి నీళ్లు త్రాగుతాను. ఇక రాత్రి 9 గంటలు అయిందంటే చాలు నిద్రపోతాను. ఖాళీ సమయంలో ఎక్కువగా సినిమాలు చూస్తాను. వంట అయితే వండలేను. కాబట్టి ఎక్కువగా ఆర్డర్ పెట్టుకొని తినేస్తూ ఉంటాను. వంట చేయాలని కోరిక ఉంది కానీ ఆ వంట ఎలా చేయాలో కూడా తెలియదు. ఇంకా ఖాళీ సమయంలో సినిమాలు చూడడం బోరు కొడితే తోటలోకి వెళ్లి కాస్త పనిచేస్తాను. క్యారెట్లు అలా తెంపేసి ఫ్రెష్ గా తింటాను” అంటూ తన అలవాట్లను చెప్పుకొచ్చింది సాయి పల్లవి. మరీ సాయి పల్లవి ఇంత యంగ్ గా , ఫిట్ గా ఉండడానికి ఆమె తీసుకునే కొబ్బరినీళ్ళే కారణం అన్నట్టుగా చెప్పుకొచ్చింది.
యాక్టింగ్ అనేది నిరంతర ప్రక్రియ..
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నను సాయి పల్లవి నాగచైతన్యను అడిగింది. యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు ? అని సాయి పల్లవి అడగగా..ఎప్పుడు నేర్చుకోవడం ఏంటి? అదొక నిరంతర ప్రక్రియ. దానికి పుల్ స్టాప్ అనేది ఉండదు. అలా పుల్ స్టాప్ పెడితే ముందుకు వెళ్లలేము అంటూ నాగచైతన్య తెలిపారు.
తండేల్ సినిమా విశేషాలు..
శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇక బుజ్జి తల్లి స్యాడ్ వర్షన్ ఏడిపించేలా ఉందని, నాగచైతన్య అందరినీ సర్ప్రైజ్ చేసేలా నటించాడని, సాయి పల్లవి ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేసిందని ఇద్దరు ఒకరికొకరు తమ యాక్టింగ్ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ వీకెండ్ కి తండేల్ బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పడం గమనార్హం. మరి భారీ అంచనాల మధ్య, ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని విడుదలైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.