Big Stories

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : స్వతంత్ర భారత తొలి ఓటర్​గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్​ శరణ్​ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్​లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 1917 జులై 1న జన్మించిన నేగి టీచర్​గా పనిచేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసి, స్వతంత్ర భారతదేశ తొలి ఓటర్​గా చరిత్రకెక్కారు.

- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లో 1951లో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో హిమాచల్‌లో ముందుగానే వోటింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. శ్యామ్ సరన్ నేగి అక్టోబర్ 25, 1951లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 ఏళ్ల వయసులో నాగి మొదటిసారి వోటు వేశారు. ‘సనమ్ రే’ హిందీ సినిమాల్లో కూడా శ్యామ్ సరన్ నేగి నటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News