BigTV English

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Five Army Soldiers Died in Ladakh(Telugu news live): కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో విషాద ఘటన జరిగింది. LAC వద్ద యుద్ధట్యాంకుల విన్యాసాలు చేస్తున్న సైనికులు మృతి చెందారు. T-72 యుద్ధట్యాంక్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. జవాన్ల కోసం గాలించగా వారంతా మరణించినట్లు తెలిసింది.


లేహ్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో మందిర్ మోర్హ్ లోని బోధి నదిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆర్మీ విన్యాసాలలో భాగంగా.. యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా.. వరదల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగి యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. దురదృష్టవశాత్తు అందులో ఉన్న ఐదుగురు జవాన్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించారు. మృతి చెందిన సైనికుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నదిని దాటుతూ.. ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు జవాన్లు మృతి చెందడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దేశంకోసం సైనికులు చేసిన సేవలను మరచిపోలేమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు X వేదికగా పోస్ట్ చేశారు.


Related News

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Big Stories

×