BigTV English

Yamuna River : ఉత్తరాదిలో భారీ వర్షాలు.. మళ్లీ యమునా నది ఉగ్రరూపం..

Yamuna River : ఉత్తరాదిలో భారీ వర్షాలు.. మళ్లీ యమునా నది ఉగ్రరూపం..

Yamuna River news today(Telugu breaking news) : ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టిన కొన్నిరోజులకే మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బుధవారం ఉదయానికి నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటేసింది. ఢిల్లీలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమునా నది ఉప్పొంగుతోంది.


కేంద్ర జల కమిషన్‌ సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం 205.48 మీటర్లుగా నమోదైంది. సాయంత్రానికి నీటిమట్టం 205.72 మీటర్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నీటిమట్టం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. ఆ సమయంలో నీటిమట్టం 208.66 మీటర్లుగా నమోదైంది. అప్పుడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపునకు గురయ్యాయి.

ఉత్తరాదిలో పలు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జులై 22 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గుజరాత్‌లోనూ రెండు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గిర్‌ సోమ్‌నాథ్‌, కచ్‌, నవ్‌సరి, వల్సాద్‌, అమ్రేలీ, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.


Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×