E-Paper
Advertisement

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
Advertisement

Flydubai Incident: ఫ్లై దుబాయ్‌ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ పై దాడి చేసిన కో-పైలట్‌ హమామ్‌ అల్‌హమామీ, విమానాలు నడపకుండా ఒమన్‌ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించినట్లు తేలింది. తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడన్న కారణంగా అతడిపై ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక అల్‌హమామీ.. ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు కూడా రిపోర్ట్ వచ్చింది.

హమామ్ ప్రవర్తనపై ఫిర్యాదులు..

Advertisement

ఒమన్‌కు చెందిన హమామ్‌ అల్‌హమామీ.. 2024లో ఒమన్‌ ఎయిర్‌లో కో-పైలట్‌ ట్రైనీగా పనిచేశాడు. అతడి ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో భద్రతా అధికారులు అతడు విమానాలు నడపకుండా నిషేధం విధించినట్లు చెప్తున్నారు. అయితే, సంస్థలోని అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో అతడిని కొనసాగించినట్లు తెలుస్తోంది. హమామ్ కొంతకాలం సిరియాలో కూడా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలోనే తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అతడు ఏదైనా తీవ్రవాద సంస్థతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్నాడా? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు .

ఫ్లై దుబాయ్‌లోకి ఎలా వచ్చాడు?

Advertisement

ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధం ఉన్నా.. అల్‌హమామీ ఇతర దేశాల్లోని విమానయాన సంస్థల్లో పనిచేశాడు. అతడి పేరుతో ఉన్న లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ ప్రకారం.. ఒమన్‌ ఎయిర్‌లో సుమారు ఏడేళ్లు పనిచేసిన అల్‌హమామీ.. 2025 ఫిబ్రవరిలో ఆ సంస్థను వీడాడు. అదే ఏడాది జూన్‌లో మొరాకో జాతీయ విమానయాన సంస్థ రాయల్‌ ఎయిర్‌ మారోక్‌లో చేరాడు. 2026 జనవరిలో అక్కడ ఉద్యోగం మానేసి.. ఫ్లైదుబాయ్‌లో చేరాడు. ఉద్యోగంలో చేరేముందు అతని ప్రీవియస్ హిస్టరీ ఎందుకు చెక్ చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

అయితే.. ఈ ప్రమాదం జరిగిన అనంతరం ఆ లింక్డ్ఇన్ ఖాతా డిలీట్‌ అయింది. అల్‌హమామీకి చెందినవిగా భావిస్తున్న సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ కాక్‌పిట్‌ నుంచి తీసిన వీడియోలు, ఇజ్రాయెల్‌ విమానాలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి అతడు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Also Read: పిచ్చోడికి గుడులు కూల్చడమే తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్!

Tags

Related News

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

Big Stories

Advertisement
×