Shekar Master Remuneration:శేఖర్ మాస్టర్ ..టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ల లిస్టు తీస్తే ఈయన పేరు ఖచ్చితంగా ఉంటుంది.స్టార్ హీరోలందరికీ చెప్పుకోతగ్గ డాన్స్ బీట్స్ అన్నీ ఈయన కొరియోగ్రఫీలోనే వచ్చాయి మరి.
శేఖర్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత
తనదైన మాస్ అండ్ ట్రెండీ స్టెప్పులతో హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్టెప్పులు కంపోజ్ చేయడం, పాటలో ఒక హుక్ స్టెప్‌ను క్రియేట్ చేసి దాన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేయడం శేఖర్ మాస్టర్ కి వెన్నతో పెట్టిన విద్య.అలాంటి శేఖర్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత పారితోషికం పుచ్చుకుంటాడా అన్న ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది.
దాదాపు 60 లక్షల నుండి కోటీ పది వరకి
అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం శేఖర్ మాస్టర్ టాప్ హీరో సినిమాలో ఒక్క పాటకి కొరియోగ్రఫీ అందించడానికి దాదాపు 60 లక్షల నుండి కోటీ పది వరకి తీసుకుంటాడని తెలుస్తుంది.ఇదే నిజమైతే మాత్రం చిన్న సినిమాల హీరోల కన్నా ఇది ఎక్కువనే చెప్పాలి. ఇక చిన్న సినిమాలైతే పాతిక లక్షల నుండి యాబయ్ వరకు, మరీ చిన్న సినిమాలైతే 5 నుండి పది లక్షల వరకు పారితోషికం తీసుకుంటాడన్న టాక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.మరి ఇందులో ఏది ఎంత నిజం ఉందన్న విషయం స్వయంగా శేఖర్ మాస్టర్ బయట పెడితే కానీ తెలీదు .
పాటల విషయానికి వస్తే
ఇక శేఖర్ మాస్టర్ చేసిన పాటల విషయానికి వస్తే ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలోని ‘టాప్ లేచిపోద్ది’, ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’, ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్’, ‘ఫిదా’లో ‘వచ్చిండే’,‘ఐస్మార్ట్ శంకర్’లో ‘దిమాక్ ఖరాబ్’ వంటి పాటలకు శేఖర్ మాస్టర్ స్టెప్పులని కంపోజ్ చేసిన సంగతి తెల్సిందే.
అలాగే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘మైండ్ బ్లాక్’, ‘డాంగ్ డాంగ్’ సర్కారు వారి పాట’లో ‘కళావతి’, ‘పెన్నీ’సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించింది శేఖర్ మాస్టారే. అలాగే అల్లు అర్జున్‘అల వైకుంఠపురములో’లో ‘రాములో రాములా’,‘లవ్ స్టోరీ’లోని ‘సారంగ దరియా’ ‘పుష్ప’లో ‘సామి సామి’‘పుష్ప 2’లో ‘పీలింగ్స్ వంటి పాటలకి కంపోజ్ చేసిన స్టెప్స్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకున్నాయో చెప్పక్కర్లేదు.
రిగ్రేట్ అయిన శేఖర్ మాస్టర్
అయితే , ‘డాకు మహారాజ్’లో ‘దబిడి దిబిడి’ అలాగే మిస్టర్ బచ్చన్ లోని మరో పాటకి కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ నెగెటివ్ టాక్ ని మూట గట్టుకున్నాయి కూడా. ఇక ఈ పాటలు చేసినందుకు మాస్టర్ రిగ్రేట్ అవ్వడమూ మనకి తెల్సిందే.
ALSO READ:SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్ .. 13 కోట్ల ఓట్ల లెక్కేంటి?
ఏది ఏమైనా రాకేశ్ మాస్టర్ వద్ద గ్రూప్ మెంబర్ గా జాయిన్ అయిన శేఖర్ మాస్టర్ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీని శాసిన కొరియోగ్రాఫర్ లలో ఒకడిగా పేరు తెచ్చుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. !