E-Paper
Advertisement

కాంగ్రెస్ నేత దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. పదంసింగ్ పాటిల్ నిర్దోషి

కాంగ్రెస్ నేత దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. పదంసింగ్ పాటిల్ నిర్దోషి
Advertisement

Court Verdict: మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్ ను నిర్దోషిగా తేలుస్తూ ముంబయి ప్రత్యేక న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. 2006 జూన్ 3న నింబాల్కర్ కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు అడ్డగించి ఆయనతో పాటు డ్రైవర్ ను కాల్చి చంపారు. ప్రజాధరణ పొందిన నింబాల్కర్ హత్య.. అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ఆయనకు స్వయాన బంధువైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత పదంసింగ్ ను కోర్టు నిర్దోషిగా కోర్టు తేల్చింది.

నింబాల్కర్ హత్య కేసుకు సంబంధించి పదం సింగ్ తో పాటు ఎంతోమంది ప్రముఖులు విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సునేత్ర పవార్ సోదరుడు, లాతూరు వ్యాపారవేత్త సతీశ్ మందాడే, మాజీ బీజేపీ కార్పొరేటర్ మెహన్ శుక్లా, మాజీ ఎక్సైజ్ అధికారులు పరాస్ మల్ జైన్, శశికాంత్ కులకర్ణి, బీఎస్పీ కార్యకర్త కైలాశ్ యాదవ్ వారిలో ఉన్నారు. అలాగే కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న దినేశ్ తివారీ, పింటూ సింగ్, చోట పాండే సైతం ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Advertisement

కాంగ్రెస్ నేత అయిన నింబాల్కర్ ను హత్య చేసేందుకు రూ.30 లక్షల కాంట్రాక్టును శుక్లా, మండాడేల నుంచి తీసుకున్నట్లు తొలుత జైన్ అంగీకరించాడు. ఈ కేసులో అతడు అప్రూవర్ గా మారడంతో అతడికి క్షమాభిక్ష సైతం లభించింది. అయితే కుట్ర వెనుక ప్రధాన నిందితుడిగా పదంసింగ్ పాటిల్ ఉన్నట్లు 2009లో సీబీఐ తన ఛార్జ్ షీటులో పేర్కొంది. ఉస్మానాబాద్ జిల్లాలో నింబాల్కర్ ఎదుగుదలను తట్టుకోలేక.. తనకు రాజకీయ ముప్పుగా భావించి పాటిల్ ఆయన్ను హత్య చేయించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే 2009 జూన్ లో పదం సింగ్ ను అరెస్టు చేయగా.. అదే ఏడాది సెప్టెంబర్ లో ఆయనకు బెయిల్ కూడా లభించింది.

Also Read: రీసెట్ చేసినా డేటా సేఫ్ కాదా? పాత ఫోన్ల అమ్మకంపై.. సర్వేలో షాకింగ్ నిజాలు!

Advertisement

అప్పటి నుంచి పవన్ రాజే హత్య కేసు విచారణ 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. 128 సాక్ష్యుల వాంగ్మూలాలు, వాదనలను ముంబయి ప్రత్యేక న్యాయస్థానం వింటూ వచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, విచారణలో లోపాలు ఉండటంతో 86 ఏళ్ల పదంసింగ్ పాటిల్ పై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఈ తీర్పుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీబీఐ.. దీనిని హైకోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.

Also Read: పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!

Related News

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. నకిలీ ఉద్యోగుల పేరుతో రూ.6.4 కోట్లు అవినీతి

జీతం రూ.63000.. పదో తరగతి ఉంటే చాలు.. ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ జాబ్స్

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!

ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు వ్యవహారం.. విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!

త్రిషపై కామెంట్స్ వ్యవహారం.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్, బెయల్ కోసం హైకోర్టుకు

Big Stories

Advertisement
×