E-Paper
Advertisement

‘ఆవేశంలో నోరు జారా.. డిప్రెషన్‌లోకి వెళ్లా’.. సైన్యానికి Gen Z యువతి క్షమాపణ

‘ఆవేశంలో నోరు జారా.. డిప్రెషన్‌లోకి వెళ్లా’.. సైన్యానికి Gen Z యువతి క్షమాపణ
Advertisement

Gen Z Woman: ‘మేం Gen Z’ అంటూ జమ్ము కాశ్మీర్ లో భద్రతా దళాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ 25 ఏళ్ల యువతి యూటర్న్ తీసుకున్నారు. భారత సైన్యంతో పాటు జమ్ము కాశ్మీర్ పోలీసులకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పారు. లద్దాఖ్ రోడ్డులో ఎలాంటి సమాచారం లేకుండా గంటల తరబడి వాహనాలను నిలిపివేయడంతో విసుగు చెంది ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివరణ ఇచ్చారు. సైన్యం, పోలీసులను తక్కువ చేయాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే ?

జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ‘మినీమార్గ్ – జోజిలా – సోనమర్గ్ రోడ్డు’ను తాత్కాలికంగా భద్రతా బలగాలు మూసివేశాయి. దీంతో లద్దాఖ్ నుంచి దిల్లీకి ప్రయాణిస్తున్న ఈ యువతి కూడా.. మినీమార్గ్ చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోవాల్సి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు 3-4 గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికుల్లో అసహనం పెరిగింది. మరోవైపు ఓ మంత్రి కాన్వాయ్ మాత్రం వెళ్లడానికి అనుమతించడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.

Advertisement

యువతి వివాదాస్పద వ్యాఖ్యలు

5 గంటల పాటు ఎండలో నిరీక్షించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు యువతి సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మేము ట్యాక్సులు కట్టడం లేదా? కశ్మీరీలకే కాకుండా ఇప్పుడు పర్యాటకులతోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఆమె నిలదీశారు. అంతేకాకుండా ‘మేం జెన్ జీ (Gen Z), ఈ మూర్ఖత్వాన్ని సహించబోం’ అంటూ గట్టిగా అరవడం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అయితే వెనుక ఉన్న కొందరు తనను రెచ్చగొట్టడం వల్లనే ఆ మాట నోటివెంట పొరపాటున వచ్చిందని తాజాగా యువతి వివరణ ఇచ్చారు. తన మాటల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: SBI ఉద్యోగి ఘోరం.. భార్య, చెల్లిని చంపి.. హనుమాన్ చాలీసా వింటూ ఆత్మహత్య!

డిప్రెషన్‌కు గురయ్యా: యువతి

అయితే సదరు వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ కావడంతో తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు ఆమె తెలిపారు. డిప్రెషన్‌కు లోనైనట్లు వాపోయారు. తాను కేవలం ఒక సాధారణ అమ్మాయినని ఈ ఘటన ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. దేశ ప్రజలు, భద్రతా బలగాలు.. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు తన క్షమాపణలను తెలిపారు. తన మాటల వల్ల ఎంతోమంది మనస్తాపానికి గురైనందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. భద్రతా సిబ్బందిని అవమానించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని పునరుద్ఘాటించారు.

Also Read: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×