Karnataka Crime News: పగ.. ప్రతీకారం.. ఈ మధ్య సొసైటీ బలంగా వినిపిస్తున్న పదాలు. ఆవేశానికి లోనై పగతో చంపేసుకుంటున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటన జరిగింది. దాదాపు ఏడాది తర్వాత కూతుర్ని చంపినవారిపై పగ తీర్చుకున్నాడు కన్నతండ్రి. ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
కర్ణాటకలోని ఏడాది కిందట జరిగిన హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాండ్య జిల్లాలో మాణిక్యణ హళ్లికి చెందిన వెంకటేష్ ఫ్యామిలీ ఉంటోంది. ఆయనకు దీపిక అనే కూతురు ఉంది. 25 ఏళ్ల కూతురి దీపికకు వివాహం చేశాడు తండ్రి వెంకటేష్. ఆమె ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లుపాటు దీపిక సంసారం బాగానే సాగింది.
ఆ తర్వాత దీపిక సంసారంలో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్య గురించి ఆరా తీశాడు ఆమె భర్త. దీపిక సొంతూరుకి చెందిన నితీష్‌తో పరిచయం ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసిందన్నది భర్త వెర్షన్. తరచూ దీపిక-నితీష్ సమయం, సందర్భాన్ని బట్టి కలుస్తూ ఉండేవారు. వారి రిలేషన్ గురించి దీపికను భర్త పలుమార్లు నిలదీశాడు. ఆపై తల్లిదండ్రులకు చెప్పాడు.
ఏడాది పగ.. కాపు కాసి హత్య
చివరకు కుటుంబసభ్యులు సైతం హెచ్చరించడంతో నితీష్‌కు దూరంగా ఉంది దీపిక. ఉన్నట్లుండి కోరుకున్న ప్రియురాలు దూరంగా కావడంతో తట్టుకోలేకపోయాడు నితీష్. ఎలాగైనా దీపికతో మాట్లాడి కన్వీన్స్ చేయాలని భావించాడు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశాడు.
ALSO READ: పెళ్లిలో వధూవరుల బంధువుల మధ్య గొడవ, తందూరి రొటీ కోసం ఇద్దరు హత్య
సరిగ్గా గతేడాది జనవరి 19న తన పుట్టినరోజు అని దీపికకు చెప్పి హిల్స్ ప్రాంతానికి రప్పించాడు నితీష్. అక్కడికి వెళ్లిన తర్వాత ఇరువురు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ కోపంలో ఏం జరిగిందో తెలీదుగానీ, దీపికను చంపేశాడు నితీష్. దాదాపు మూడు నెలల తర్వాత దీపిక హత్య విషయం వెలుగులోకి రావడంతో ప్రియుడు, నిందితుడు జైలు పాలయ్యాడు.
పగతో రగలిపోయిన తండ్రి
కూతురు హత్యతో ఏడాదిగా రగిలిపోతున్నాడు తండ్రి వెంకటేష్. ఎలాగైనా నితీష్ ఫ్యామిలీపై పగ తీర్చుకోవాలని భావించాడు. అందుకు సయమం వచ్చేసింది. నితీష్ చెల్లి వివాహం సెటిలైంది. ఆదివారం పెళ్లి జరగనుంది. దర్మస్థలంలో వివాహం జరగనుంది. పెళ్లికి కుటుంబ సభ్యులంతా వెళ్లిపోయారు. మెల్లగా నితీష్ తండ్రి నరసింహగౌడ ఇంటినుంచి బయలు దేరాడు.
ఇదే సరైన సమయమని భావించాడు వెంకటేష్. ఆ తర్వాత నరసింహగౌడను ఫాలో అయ్యాడు. ఊరి దాటగానే తనతో తెచ్చుకున్న కత్తితో నరసింహపై దాడి చేశాడు వెంకటేష్. నితీష్ తండ్రిని చంపడానికి ఇదే సరైన సమయమని భావించాడు. నా కూతుర్ని చంపించి.. నీ కూతురికి పెళ్లి చేస్తున్నావా అంటూ ఒక చేతితో కత్తి, మరో చేతితో నరసింహ చొక్కా పట్టుకున్నాడు.
ఆ తర్వాత కత్తితో పొడిచి పొడిచి చంపి కసి తీర్చుకున్నాడు. అప్పుడుగానీ వెంకటేష్ పగ చల్లారలేదు. ఘటన తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. హత్య గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం గాలింపు చేపట్టారు.