Actor Vishal Confirms that he Contesting in Elections 2026 Tamilnadu: తమిళ స్టార్ హీరో విశాల్ సంచలన విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. తాను స్వయంగా ఓ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు.
పొలిటికల్ ఎంట్రీపై స్టార్ హీరో విశాల్ కీలక విషయాలన్ని వెల్లడించారు. త్వరలోనే తాను రాజకీయరంగ ప్రవేశం చేసి, ఓ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని చెన్నైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రజలకు సరైన వసతులు లేవని.. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీతోనైనా సరే పొత్తు పెట్టుకుంటారా..? అని ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రస్తుతం తనని తాను నిరూపించుకునే పనిలో ఉన్నానని తెలిపారు.
Also Read: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్..
తనని తాను నిరూపించుకున్న తర్వాతనే పొత్తు గురించి, మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తానని, ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. పొలిటికల్ ఎంట్రీపై విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇటీవలే తమిళ హీరోలు ఒక్కొక్కరుగా రాజకీయాల్లోకి రావడానికి ఆశక్తి చూపిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఓ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.