Pakistan : పాకిస్తాన్ పాపం పండినట్టుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎక్కడ ఇండియా తమ దేశంపై అటాక్ చేస్తుందోనని దడుసుకొని చస్తోంది. బోర్డర్‌లో టపాసులు పేల్చినా.. ఫిరంగి తూటా పేలినట్టు ఉలిక్కిపడుతోంది. యుద్ధమా? సర్జికల్ స్ట్రైకా? అనే టెన్షన్‌తో పాకిస్తాన్‌కు పిచ్చెక్కిపోతోంది. ఇండియా మాత్రం ఏ మాత్రం ఆవేశపడకుండా.. స్లో అండ్ స్టడీగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. వేసవిలో వాటర్ బాంబ్ ఫైర్ చేసింది. మరోవైపు, పాక్ తీరు ఆ దేవుడికి కూడా నచ్చనట్టుంది. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పాకిస్తాన్‌లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి.
పాక్‌లో సూర్యప్రతాపం
అసలే ఎండాకాలం. బోర్డర్‌లో వార్ హీట్ సెగ తగులుతుంది. పైనుంచి భానుడు భగభగ మండిస్తున్నాడు. పాక్ నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఎందుకోగానీ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. సౌత్ పాక్‌లో అత్యధికంగా 49 డిగ్రీలు నమోదైంది. హాఫ్ సెంచరీ దిశగా సన్.. స్ట్రోక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్యతాపానికి అదనంగా వేడి గాలులు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ.. త్వరలోనే పాక్‌లో టెంపరేచర్ 50 డిగ్రీలను దాటేస్తుందని అంటున్నారు.
ఎండుతున్న నదులు.. సింధూ జలాలకు చెక్ పెడితే?
జస్ట్, వెదర్ న్యూస్‌గా మాత్రమే దీనిని చూడొద్దంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇప్పుడే పాక్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేస్తే.. ముందుముందు మరింత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత భారీగా పాక్ వేడెక్కితే.. అందుకు తగ్గట్టే భూగర్భ జలాలు, నదీ జలాల మట్టం పడిపోతుంది. నీరు ఆవిరయ్యే రేటు పెరుగుతుంది. ఎల్‌నినో తరహాలో తీవ్ర కరువు దాపురించవచ్చు అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. భారత్ సింధూ జలాల బాంబు పేల్చింది. ఇండియా నుంచి పాక్‌కు పారే నదీ జలాలను ఎలా దారి మళ్లించాలి? ఎలా కట్టడి చేయాలి? అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలిక, స్వల్ప కాలిక చర్యలపై చర్చించారు. ఆచరణ సాధ్యమైన అంశాలను వెంటనే అమల్లో పెట్టాలని ఆదేశించారు. అలా చేస్తే.. పాక్‌కు వచ్చే రివర్ వాటర్‌కు ఇండియా చెక్ పెడితే..? ఇక పాకిస్తాన్ పని ఖతం అంటున్నారు. సుమారు 20 కోట్ల మంది పాకిస్తానీయులకు సింధూ జలాలే జీవనాధారంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఫ్యూచర్లో వారి పరిస్థితి ఏంటనేది తలుచుకుంటేనే పాక్ వెన్నులో వణుకు పుట్టొచ్చు.
Also Read : బంగ్లాదేశ్ బోర్డర్‌లో హైటెన్షన్.. ఒకే దెబ్బకు….
పాక్‌ను ఏ దేవుడు కాపాడుతాడు?
మండుతున్న ఎండలతో ఇప్పటికే పాక్ నదుల్లో నీరు ఆవిరైపోతోంది. చాలా నదులు ఎండిపోతున్నాయి. ఇక, పైనుంచి జలాలు రాకుండా భారత్ అడ్డగిస్తే.. కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. పాక్ భవిష్యత్తుకు పెను ప్రమాదమే. ఓ సూర్య భగవన్ మమ్మల్ని కాపాడు.. ఎండలు తగ్గించు.. అని ముస్లింలైన పాకిస్తాన్‌లు వేడుకోలేరు. అల్లాహో అక్బర్ అంటూ పహల్గాంలో హిందువులపై జరిపిన ఉగ్రదాడికి.. అంతకంతా శిక్ష అనుభవించాల్సిందే. అది భారత్ రూపంలోనైనా, భానుడితోనైనా. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే పైనున్న దేవుడు చూస్తూ ఊరికే కూర్చోడు. కాస్త లేట్ అయినా, లేటెస్ట్‌గా ఖతర్నాక్ పనిష్మెంట్ తప్పదు..అంటున్నారు భారతీయులు.