Bullet Bhaskar: బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఈటీవీ జబర్దస్త్. ఈ షో మొదలైన తర్వాత కామెడీ షో అంటే ఇలానే ఉండాలి అనే విధంగా పాపులారిటీ తెచ్చుకుంది. మల్లెమాల ఎంటర్ప్రైజెస్ ఈ షోను నిర్మిస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది యాక్టర్స్ వెండితెరకు పరిచయమయ్యారు. కొంతమంది ఆర్టిస్టులుగా, మరి కొంతమంది హీరోలుగా నటిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. తాజాగా భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో సుధీర్ రష్మిల పెళ్లి పై కామెంట్ చేశారు. అసలు భాస్కర్ ఏమన్నాడో చూద్దాం..
సుధీర్ – రష్మీ లవ్ స్టోరీ ఇదే..
జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఒకరు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో యాంకర్ సుధీర్ రష్మిల బంధం గురించి మీకు ఏమైనా తెలుసా అన్న ప్రశ్న ఎదురవగా భాస్కర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లో రొమాంటిక్ జోడి అంటే సుధీర్ రష్మీ అని అందరికీ తెలిసిందే, ఇప్పుడు వాళ్ల గురించి నేను కొత్తగా మాట్లాడేది ఏముంటుంది. నా నోటితో నేను ఏదైనా చెప్తే అది ఒక థంబ్ లైన్ గా వాడుకొని యూట్యూబ్లో వేసి, సుధీర్ రష్మి ల పెళ్లి గురించి భాస్కర్ మాట్లాడాడు అని, రచ్చ చేయడానికి ఇలా అడుగుతున్నారా.. వారి మధ్య ఏముంది అన్నది అందరికీ తెలిసిందే.. కొత్తగా నేను చెప్పేది అంటే ఏది ఉండదు. అని భాస్కర్ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా, సుధీర్ రేష్మి లవ్ స్టోరీ ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మేము అందరం ఎప్పటికి ఒక ఫామిలీ ..
ఇంకా భాస్కర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ షోలో ఎప్పటికీ కొనసాగుతానని, షో ఉన్నంతవరకు నేను వేరే ఆఫర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. షో ను పైకి తీసుకురావడానికి మా టీమ్ మెంబర్స్ తో పాటు నేను కృషి చేస్తున్నాను. నేను షో నుండి ఎప్పటికీ బయటకు వెళ్ళను. ఎప్పటికీ జబర్దస్త్ షోలో పనిచేసిన వారంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసే ఉంటాము. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. జడ్జిలు కూడా మాతో చాలా క్లోజ్ గా ఉంటారు. రోజాగారు మను సార్, నాగబాబు గారు ఇలా జడ్జిగా వచ్చిన సెలబ్రిటీలందరూ మమ్మల్ని వాళ్ళ సొంత మనుషుల్లానే చూసుకున్నారు. ముఖ్యంగా మనుగారు చాలా పాజిటివ్ గా అందరితో క్లోజ్ గా వుంటారు’ అని భాస్కర్ తెలిపారు. షో యాంకర్ గా రేష్మి వ్యవహరిస్తున్నారు.దాదాపు ఈ షో ప్రారంభమై 12 ఏళ్లు అవుతుంది. వరుసగా ఇన్ని సంవత్సరాలు ఒక షో కంటిన్యూ అవ్వడం అంటే అది చాలా గ్రేట్. ఇదొక రికార్డు అనే చెప్పొచ్చు. వారానికి ఒక రోజు వచ్చే ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు.
Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..