Google Pixel Buds Pro 2: గూగుల్ తమ పాపులర్ ఇయర్‌బడ్స్ ‘పిక్సెల్ బడ్స్ ప్రో 2’ కోసం ఒక అదిరిపోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో బడ్స్ వాడే అనుభవం పూర్తిగా మారిపోనుంది. సెప్టెంబర్ నుండి అందుబాటులోకి రానున్న ఈ అప్‌డేట్‌లో Google Gemini సపోర్ట్‌తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించింది. పైగా ఈ బడ్స్‌ను ఇప్పుడు కొత్తగా ‘ఒలివ్’ కలర్ వేరియంట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ అప్‌డేట్‌లో అత్యంత కీలకమైంది డైనమిక్ ANC ఫీచర్. సాధారణంగా మనం నడుస్తున్నప్పుడు లేదా వేరే పనులు చేస్తున్నప్పుడు ఇయర్ బడ్స్ కొద్దిగా జారే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బయటి శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ కొత్త ఫీచర్ ఇయర్ టిప్స్ ఫిట్టింగ్‌ను బట్టి నాయిస్ క్యాన్సిలేషన్‌ను తనకు తానే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీంతో ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!
ఇప్పుడు ఆడియో సెట్టింగ్స్ మార్చుకోవడం మరింత తేలికైంది. ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి వెతకాల్సిన అవసరం లేకుండానే జెమిని ఏఐ ద్వారా నేరుగా వాయిస్ కమాండ్స్‌తో పని పూర్తి చేయవచ్చు. బేస్ పెంచాలన్నా లేదా ఆడియో మోడ్స్ మార్చాలన్నా జస్ట్ వాయిస్‌తో చెబితే సరిపోతుంది.
మీరు ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోతే.. మీ చేతికి ఉన్న పిక్సెల్ వాచ్ దానిని వెంటనే గుర్తిస్తుంది. మీరు నిద్రపోయారని తెలియగానే బడ్స్‌లో ప్లే అయ్యే ఆడియో ఆగిపోతుంది. అంతేకాకుండా.. నిద్రలో అనుకోకుండా బడ్స్ తాకినా ఏమీ ప్లే కాకుండా టచ్ కంట్రోల్స్ ఆఫ్ అవుతాయి. నోటిఫికేషన్లు కూడా సైలెంట్ అయిపోతాయి.
ఇతర దేశాల లేదా వేరే భాష మాట్లాడే వారితో మాట్లాడటం ఇప్పుడు మరింత సులభం. కొత్త అప్‌డేట్‌తో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ 70కి పైగా భాషలకు సపోర్ట్ చేస్తుంది. మీరు మాట్లాడే భాషను ఎదుటివారికి, వారు మాట్లాడేదాన్ని మీకు రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేసి వినిపిస్తుంది. ఇక డిజైన్ పరంగా టెన్సర్ A1 చిప్, 11mm డ్రైవర్లు, ఐపీ54 రేటింగ్, కేస్‌తో కలిపి దాదాపు 48 గంటల వరకు వచ్చే బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!