E-Paper
Advertisement

Chennai Airport : చెన్నై ఎయిర్ పోర్టులో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ అదుర్స్..

Chennai Airport : చెన్నై ఎయిర్ పోర్టులో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ అదుర్స్..
Advertisement

Chennai Airport : ప్రధాని మోదీ చెన్నై విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను ప్రారంభించారు. రూ.1,250 కోట్ల నిధులతో ఈ టెర్మినల్‌ నిర్మించారు. రెండు దశల్లో చెన్నై విమానాశ్రయాన్ని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది.

టెర్మినల్ ప్రత్యేకతలివే..
నూతన టెర్మినల్‌ వల్ల ప్రయాణికుల రాకపోకలు ఏడాదికి 23 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 100 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, 108 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు, 17 ఎస్కలేటర్లు, 17 ఎలివేటర్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఏటా ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరుగుతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా దీని నిర్మించారు. మొత్తం 108 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లను రెండు భాగాలు విభజించారు. ఇక్కడి నుంచి వెళ్లేవారి కోసం 54 కౌంటర్లు, విదేశాల నుంచి వచ్చే వారి కోసం 54 కౌంటర్లను వినియోగించనున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది.

Advertisement

దక్షిణాది సంస్కృతికి అద్దం పట్టేలా..
నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను దక్షిణాది సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించారు. ఇళ్లలో ప్రవేశ ద్వారాల వద్ద కనిపించే రంగోళి, కోలం లాంటి గుర్తులను ఏర్పాటు చేశారు. చీరలు, దేవాలయ నమూనాలు టెర్మినల్‌లో కనిపిస్తాయి. పర్యావరణ హితంగా ఉండేలా టెర్మినల్‌ ను తీర్చిదిద్దారు.

వందే భారత్ రైలు ప్రారంభోత్సవం..
చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య నడిచే వందే భారత్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి వందే భారత్‌ రైలును ప్రారంభించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో కాసేపు మోదీ ముచ్చటించారు.

Related News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×