E-Paper
Advertisement

India Covid Update: దేశంలో కొత్తగా 412 పాజిటివ్ కేసులు.. హైదరాబాద్ లో 45

December 26th india covid update

India Covid Update: దేశంలో కొత్తగా 412 పాజిటివ్ కేసులు.. హైదరాబాద్ లో 45
Advertisement

India Covid Update: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. శీతాకాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. తొలి మరణం సంభవించింది. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో ఒకరు మృతి చెందడంతో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు 55కు చేరాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 45 పాజిటివ్ కేసులున్నాయి.

తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4170కు చేరింది. ఇదే సమయంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. తెలంగాణలో ఒకరు మరణించారు. కర్ణాటకలో మూడు కొత్తరకం వైరస్ కేసులు నమోదైనట్లు వివరించింది. ఈ ఏడాది తెలంగాణలో, ఏపీలో తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. విశాఖలో ఒక వ్యక్తి కరోనాతో మరణించాడు.

Advertisement

తాజాగా నమోదైన కేసుల్లో.. తెలంగాణలోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో నాలుగు, ఫీవర్ ఆస్పత్రిలో 5, నిలోఫర్ లో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లో 45, రంగారెడ్డి 3, సంగారెడ్డి 2, ఖమ్మం 1, కరీంనగర్ 1, వరంగల్ 2, మెదక్ 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో 10 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 8 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×