BigTV English
Advertisement

Ram Charan : పెద్దిపై శివన్న కామెంట్స్… వింటే మెంటలెక్కిపోతుంది భయ్యా

Ram Charan : పెద్దిపై శివన్న కామెంట్స్… వింటే మెంటలెక్కిపోతుంది భయ్యా

Ram Charan : కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి కీలక పాత్రలలో ’45’ సినిమా రానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఉమా రమేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా కన్నడంలోనే కాక తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈవెంట్ కు శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి పాల్గొన్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా శివరాజ్ కుమార్ పెద్ది సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు పెద్ది సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటి? అసలు ఏమన్నాడో చూద్దాం..


గ్రేట్ ఫీలింగ్..

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమాతో, అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను అభిమానులకు దగ్గరయ్యారు శివన్న. తాజాగా పెద్ది సినిమా గురించి, అందులో ఆయన క్యారెక్టర్ గురించి చెబుతూ.. ఈ సినిమాలో నా పాత్ర చాలా వెరైటీగా డిజైన్ చేశారు. ఒక కీలక పాత్రలో మీ ముందుకు ఈ సినిమా ద్వారా రానున్నాను. రామ్ చరణ్, బుచ్చిబాబు నాకు స్టోరీ లైన్ వినిపించినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా గ్రేట్ ఫీలింగ్. ఈ సినిమా షూటింగ్ కోసం 20 రోజులుగా హైదరాబాదులోనే ఉంటున్నాను. ఇక్కడ వారంతా నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ రెండు రోజులు పాల్గొన్నాను. సినిమాలో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో అద్భుతంగా ఉంది అంటూ.. శివన్న పెద్ది సినిమా గురించి మాట్లాడారు. ఈ వీడియో చూసిన వారంతా ఈ సినిమాపై శివన్న చేసిన కామెంట్స్ తో అంచనాలు ఇంకా పెంచేశారు అని అంటున్నారు. మీరు ఎప్పుడు ఈ సినిమాలో కనిపిస్తారని ఎదురు చూస్తున్నాం అని, ఇలాంటి తెలుగు ఫిలిమ్స్ మీరు ఇంకా చాలా చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా గ్లోబల్ స్టార్ సినిమాలో కన్నడ స్టార్ ని కీలక పాత్రలో తీసుకోవడం నిజంగా మూవీ టీంని అభినందించాల్సిన విషయం.


ఆ సినిమాలో వున్నా ..

ఇక సినిమా విషయానికి వస్తే.. శివన్న ఇప్పటికే వరుసగా సినిమాలు చేసి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు 45 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటితో పాటు జైలర్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తెలుగులో పెద్ది సినిమాలోను కనిపించనున్నాడు. ఇటీవల అయన కాన్సర్ ట్రీట్మెంట్ ను తీసుకొని ఆరోగ్యంగా తిరిగివచ్చారు.

Jewel Thief OTT : కోట్లు పెట్టి తీశారు… చేసేదేమ్ లేకుండా.. డైరెక్ట్ ఓటీటీలో..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×