Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని తెల్పింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దని తెల్పింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది.
మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. త్రివిధ దళాలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సీడీఎస్ అనిల్ చౌహాన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తతలపై చర్చిస్తున్నారు. పాక్ కవ్వింపు చర్యలను ప్రధానికి వివరిస్తున్నట్లు సమాచారం. ఇక రేపు భారత్ పాక్ DGMOల సమావేశం జరగనుంది. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశంపైనా డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం.
భారత్ పాక్ మధ్య యుద్ధం ఆరినట్లుగా కనిపించడంలేదు. తాజాగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని వెల్లడి ఐఏఎఫ్ వెల్లడించింది. భారత్ పాక్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? దీని ముగింపు ఎక్కడ? గతం తాలూకూ.. అనుభవాలు మనకేం చెబుతున్నాయి? ఇకనైనా పాక్ ఈ యుద్ధాన్ని ముగిస్తుందా? ఇక నుంచి ఒక లెక్క. ఇకపై మరో లెక్కగా భావించడానికి వీల్లేదా? హ్యావే లుక్..
మరికొన్నాళ్లు పోతే మొత్తానికే మోసం వస్తుందన్న భయం ఉగ్రవాదులకు భారత్ రెడ్ లైన్. గీత దాటితే తాట తీస్తామన్న భారత్. ప్రతి ఉగ్ర చర్యనూ యుద్ధంగానే చూస్తామని ప్రకటన. బాంబు పేలుళ్లు, కాల్పులు, హైజాక్స్, సైబర్ అటాక్స్.. బయో కెమికల్ అటాక్స్.. అన్నీ ఉగ్రదాడుల కిందే లెక్క. ఉగ్ర చర్యలకు తగిన విధంగా స్పందించాలని తేల్చి చెప్పిన భారత్. టెర్రర్ అటాక్స్ ఎట్టి పరిస్థితులనూ సహించేది లేదని వార్నింగ్. ఇకపై ఏ చిన్న టెర్రర్ అటాక్ జరిగినా యుద్ధం తప్పదన్న భారత్. ఇవీ ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ 2 లోని కాల్పుల విరమణ ఒప్పందం తాలూకూ బ్రేకింగ్స్.
ఇండియా లక్ష్యం యుద్ధం కాదు. ఉగ్రమూకల పనిపట్టడమే. ఉగ్రదాడులు చేయాలంటే భయపడే పరిస్థితి తేవడమే. ఆపరేషన్ సిందూర్ ఆ పనిని విజయవంతంగా పూర్తిచేసింది భారత్. ఉగ్రమూలాలను తుంచేసిందా..? అంటే.. అది ఎవరూ చెప్పలేరు. అయితే… పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలను మాత్రం ధ్వంసం చేసింది. భారత్‌పై జరిగిన ఉగ్రదాడులు కీలకంగా వ్యవహరించిన ముష్కరులను మట్టుబెట్టింది. పెహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు గట్టిగానే బుద్ధి చెప్పింది. అనుకున్న లక్ష్యం చేరుకున్నాం.. ఇంకా పొడిగించడం ఎవరికీ మంచిది కాదని భావించిన భారత ప్రభుత్వం.. శాంతి మార్గంలో వెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది.
సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నా.. ఉగ్రవాదంపై భారత వైఖరి మారదని.. విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణన జరిగిందన్నారు.
ALso Read: అరేయ్ ఏంట్రా ఇది.. వాళ్లని కూడా వదలరా.. సోఫియా, వ్యోమికా సింగ్, పేర్లతో ఫేక్ అకౌంట్స్
ఇక.. భారత్ దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరిగింది. భారత్‌తో పెట్టుకుని భారీగా నష్టపోయింది. యుద్ధం వస్తే.. ఇండియా ముందు నిలబడే పరిస్థితి కూడా లేదు దాయాది దేశానికి. నాలుగు రోజుల్లోనే కోలుకోలేనంతగా దెబ్బతింది. భారత్ పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగిఏ.. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ఆ విషయాం ఆ దేశానికి కూడా తెలుసు. అందుకే.. కవ్వింపు చర్యలకు దిగినా… చివరికి కాళ్లబేరానికి వచ్చింది.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా… పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోలేదు. భారత్ నుంచి సింధూ జలాలు వెళ్లవు. దీంతో.. ఆ దేశానికి నీటి కటకట తప్పదు. వాణిజ్య ఒప్పందం రద్దు, సరిహద్దుల మూసివేతతో… నిత్యవసరాలు, మెడిసిన్ వంటివి భారత్ నుంచి వెళ్లవు. ఈ పరిస్థితి చక్కబడలన్నా.. భారత్ దాడులతో ధ్వంసమైన వ్యవస్థలను పునర్‌నిర్మించుకోవాలన్నా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు కష్టమే.