Jai Hanuman: ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు వెళ్లాయి అనేది తెలియకుండానే పోతాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చరిత్రను తిరగరాస్తాయి. అలాంటి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉంటాయి. అలా ఈ ఏడాది మొత్తంలో ఎన్ని సినిమాలు వచ్చినా.. పోయినా.. ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉన్న చిత్రాల్లో హనుమాన్ సినిమా మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సంక్రాంతి రేసులో పెద్ద పెద్ద చిత్రాలు నిలబడ్డాయి. థియేటర్స్ తక్కువ ఉన్నాయి. పోస్ట్ పోన్ చేయాలనీ ఒత్తిడి ఉంది. అయినా హనుమాన్ మేకర్స్ అస్సలు తగ్గేదేలే అంటూ అన్నింటిని దాటుకొని సంక్రాంతి రేసులో నిలబడ్డారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్.. భారీ విజయాన్ని అందుకుంది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి రికార్డ్ కలక్షన్స్ క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది. సంక్రాంతి 2024 విన్నర్ గా నిలబడింది.
Dulquer Salmaan: నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్.. మెగా హీరోను ఐస్ చేస్తున్న దుల్కర్ సల్మాన్
తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ ను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఆ విజువల్స్, ఆ మ్యూజిక్.. థియేటర్ లో వింటే గూస్ బంప్స్ వచ్చేశాయి అని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి షాట్ ఇంకొక ఎత్తు. శ్రీరాముడుకు హనుమంతుడు ఒక మాట ఇస్తాడు. ఆ మాట ఏంటి .. ? అనేదాని కోసం హనుమాన్ సీక్వెల్ చూడాల్సిందే అని ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను ముగించాడు.
ఇక బాహుబలి చివర్లో.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ? అన్న ప్రశ్నబాహుబలి 2 చూడాలని ఎంత ఆతృతను పెంచిందో.. శ్రీరాముడుకు హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి.. ? అని తెలుసుకోవడానికి జై హనుమాన్ చూడాల్సిందే అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆతృతను ఫుల్ స్టాప్ పడబోతోంది. త్వరలోనే జై హనుమాన్ సెట్స్ మీదకు వెళ్లనుంది. హనుమాన్ ను మించి జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
Nani New Movie : స్టార్ హీరో సినిమాలో వేలు పెట్టిన మేనేజర్… పారితోషికం కోసం ప్రొడ్యూసర్ ను మార్చారా?
తాజాగా జై హనుమాన్ నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ను ఇచ్చారు. రేపు దివాళీ కానుకగా జై హనుమాన్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో హనుమాన్ .. ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపించారు. జై హనుమాన్ లో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేదానిపై పెద్ద చర్చనే జరుగుతుంది. ఈసారి ప్రశాంత్ వర్మ.. ఒక పెద్ద స్టార్ హీరోనే దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
“ఈ దీపావళి.. పరాక్రమం యొక్క జ్వాలలను తిరిగి రగిలిస్తూ.. మన భారతీయ ఇతిహాసాలను గౌరవించే కథతో ఇతిహాసాలకు జీవం పోస్తోంది” అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నాడు. ప్రశాంత్ వర్మ కథ, టేకింగ్ ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. కచ్చితంగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు ఈ ఫస్ట్ లుక్ లో ఉండే హీరో ఎవరో తెలియాల్సి ఉంది.
This Diwali, bringing the legends to life with a tale that rekindles the flames of valor and honors our Indian Itihasas❤️🔥@MythriOfficial @ThePVCU #JAIHANUMAN 🔥 #NaveenYerneni @mythriravi #PVCU #DIWALIisCOMING 🪔 pic.twitter.com/sjOFBC5vIV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2024