BigTV English

Threat To Bihar MP: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

Threat To Bihar MP: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

Pappu Yadav Gets Lawrence Bishnoi Threat: నిన్న మొన్నటి వరకు లారెన్స్ బిష్ణోయ్ మీద అవాకులు చవాకులు పేలిన బీహార్ ఎంపీ పప్పూ యాదవ్, ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ తన ప్రాణాలు తీస్తాడోనని గజ్జున వణుకుతున్నారు. నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యవహారంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఓ అజ్ఞాత వ్యక్తి పప్పూ యాదవ్ కు కాల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాం.  సల్మాన్‌ ఖాన్‌ వ్యవహారంలో ఆయన దూరంగా ఉండాలి. లేకపోతే లేపేయడానికి వెనుకాడం. సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. ఆయన మాత్రం మా కాల్స్‌ కు స్పందించటం లేదు” అన్నాడు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘జడ్’ కేటగిరీ భద్రత పెంచాలని కోరిన పప్పూ యాదవ్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర హోంశాఖతో పాటు బీహార్ డీజీపీకి పప్పూ యాదవ్ లేఖ రాశారు. చాలా సార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపు సందేశాలను కేంద్రానికి పంపాడు.


బిష్ణోయ్ గ్యాంగ్ ను లేపేస్తానని పప్పూ యాదవ్ వార్నింగ్

అటు, పప్పు యాదవ్‎ను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేయడానికి అసలు కారణం వేరే ఉంది. రీసెంట్ గా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసింది. ఈ హత్య తర్వాత ఎంపీ పప్పూ యాదవ్‌ సిద్ధిఖీ కొడుకును కలిసి ధైర్యం చెప్పారు. పనిలో పనిగా సల్మాన్ ఖాన్ కు కాల్ చేసి భరోసా ఇచ్చారు. అంతకు ముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ నెట్ వర్క్ ను కేవలం 24 గంటల్లో అంతం​ చేస్తానని తేల్చి చెప్పారు. “ఒక క్రిమినల్ జైలులో కూర్చుని సవాల్ చేస్తున్నాడు. జనాలను చంపుతుంటే అందరూ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మూసేవాలా, కర్ణి సేన చీఫ్, ఇప్పుడు సిద్ధిఖీని చంపేశారు. ప్రభుత్వం అనుమతిస్తే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను లేకుండా చేస్తాను” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో పప్పూకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్ వచ్చింది.

Read Also: జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Read Also: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×