Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. ఇవాల్టి నుంచి మూడ్రోజల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఈనెల 28 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు అల్లాడి పోతున్నారు. వర్షం కోసం రైతులు ఎంతో ఎదురు చూసారు. రుతపవనాల రాకతో.. ఎంతో సంతోషంగా విత్తనాలు వేశారు. కానీ వర్షాలు సకాలంలో పడక విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరి విత్తనాలు వేశాము.. అయిన వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు నిరాశలో కూరుకుపోయారు. అయితే నిన్నటి నుంచి వాతావరణం మారిపోయి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ్టి నుంచి రానున్న నాలుగు రోజులు తెలంగాణ అన్ని జిల్లాల్లో వాతావరణం మేఘావృతం అయినట్టుగా ఉంటుందని వాతావరణ వాఖ అధికారులు తెలిపారు. ఇక అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడితే దాని ప్రభావంతోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే జూన్ 24 తర్వాత అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక నిన్నటి నుంచి హైదరాబాద్ అంతా మేఘావృతం అయ్యి ఉంది.
ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, అక్కడి పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ కావడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కు వర్షాలు కురవడం వల్ల ట్రాఫిక్ అంతరాయాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నగర పాలకల సంస్థలు. ట్రాఫిక్ పోలీసులు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read: సూర్యాపేటలో గ్యాంగ్ వార్.. నడిరోడ్డుపై విచక్షణా రహితంగా
ఉరుములు, మెరుపులు అధికంగా ఉండే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఎత్తైన ప్రాంతాల్లో నిలబడకూడదని, ఇంట్లో ఎలక్ట్రిల్ కు సంబంధించిన పరికరాలు వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే, విద్యుత్ స్తంభాలు, కంచె లాంటి వాటి నుంచి దూరంగా ఉండాలన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపారు.