Kohli – Gambhir: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ ( Border-Gavaskar Trophy 2024/25 )… చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) ప్రస్తుతం మూడవ టెస్టు జరుగుతోంది. అయితే ఈ మూడవ టెస్టు నేపథ్యంలో…. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఇద్దరు స్టార్లను ఉద్దేశించి టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా అన్నట్లుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: Ind vs Aus 3rd Test Day 4: ఫాలో ఆన్ గండం తప్పించుకున్న టీమిండియా.. వివరాలు ఇవే!
మూడవ టెస్ట్ మ్యాచ్లో… ఫాలో ఆన్ తప్పించుకుంది టీమిండియా. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని మరి… హ్యాపీగా కనిపించారు. ఆకాష్ దీప్ బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలోనే టీమ్ ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవడం జరిగింది.
దీంతో విరాట్ కోహ్లీ ( Virat Kohli )అలాగే గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir )ఇద్దరు హై ఫై… ఇచ్చుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు. టీమిండియా బతికి బయటపడిందని… తెగ ఎంజాయ్ చేశారు గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ. అయితే గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు చేసిన పని… టీమిండియా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. బ్యాటింగ్ చేతకాదు కానీ…. ఇలా హై-ఫై ఇచ్చుకోవడం ఏంటని నిలదీస్తున్నారు ఫ్యాన్స్.
విరాట్ కోహ్లీ… ఈ టోర్నమెంట్లో పెద్దగా రాణించలేదు. ఈ మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో ఉంటే… అతను మాత్రం చెత్త షాట్లు ఆడి అవుట్ అయ్యాడు. ఇదే విషయాన్ని టీమిండియా ఫ్యాన్స్ గుర్తు చేసి మరి… విరాట్ కోహ్లీ పై మండిపడుతున్నారు. నీకు బ్యాటింగ్ చేతకాదు కానీ… డ్రెస్సింగ్ రూమ్ లో ఎంజాయ్ చేయడం కావాలా ,? అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఇక అటు గౌతమ్ గంభీర్ ను కూడా బండ బూతులు తిడుతున్నారు.
Also Read: ICC WTC 2025 final: మూడో టెస్ట్ డ్రా అయితే.. WTC నుంచి టీమిండియా తప్పుకోవడమేనా ?
టీమిండియా బ్యాటింగ్ లైన్ అప్ సెట్ చేయలేని గౌతమ్ గంభీర్… సంబరాలు చేసుకోవడం ఏంటని… సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఈ ఇద్దరు దిగ్గజాలు… టీమిండియా కు అవసరమా? అంటున్నారు. ఈ నేపథ్యంలోనే… గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్… సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా… ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి అయ్యాయి. నాలుగవ రోజు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 252 పరుగులు చేసింది. మరో 193 పరుగులు… ఆస్ట్రేలియా కంటే టీమిండియా వెనుకబడి ఉంది.
Virat Kohli’s reaction on akashdeep Saving Follow-on for team india, and the after hitting six.😂🤍🔥#INDvsAUS pic.twitter.com/RLK598FZEB
— Utkarsh (@toxify_x18) December 17, 2024