BigTV English

India – PoK : పీవోకేకు రాఫెల్ ఫైటర్ జెట్స్.. కమాన్ అటాక్..

India – PoK : పీవోకేకు రాఫెల్ ఫైటర్ జెట్స్.. కమాన్ అటాక్..

India – PoK : జంగ్ సైరన్ మోగించే టైమ్ వచ్చేసింది. కేంద్రం సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. ఇక మీ ఇష్టం. మీ వెనక మేముంటాం. ప్రధాని మోదీ ధీమాతో.. ఇండియన్ ఆర్మీ అటాక్‌కు రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. పీవోకే సరిహద్దుల్లో 4 రాఫెల్ జెట్స్ చక్కర్లు కొట్టాయి. భారత్‌-పాకిస్థాన్ బోర్డర్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.


రాఫెల్ జెట్స్‌ను ఎందుకు పంపించారు? భారీ దాడికి రంగం సిద్ధమవుతోందా? POKలో ఉగ్రవాద శిబిరాలను స్మాష్ చేస్తారా? దాడికి వ్యూహాలను సిద్ధం చేయడానికే రాఫెల్‌ జెట్స్‌ పంపారా? అనే ప్రశ్నలు.

యుద్ధానికి సిద్ధం..


మరోవైపు, భారత సైన్యం ఎప్పుడు దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. సరిహద్దులకు రాడార్లు, యుద్ధ విమానాలు తరలిస్తోంది. మరికొన్ని గంటల్లో ఇండియా తమ దేశంపై దాడి చేయబోతోందంటూ పాక్ మంత్రి ఇప్పటికే లీకులిచ్చాడు. దీంతో రెండు దేశాలు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నట్టు అనిపిస్తోంది.

హాట్‌లైన్‌లో హాట్ డిస్కషన్

నియంత్రణ రేఖ (Loc) వెంబడి పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా కాల్పులు జరుపుతూనే ఉంది. ఇండియన్ ఆర్మీని కవ్విస్తూనే ఉంది. వాట్ ఈజ్ దిస్? అంటూ భారత మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్‌తో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాదని ఎందుకు ఫైరింగ్ చేస్తున్నారని.. ఇలానే చేస్తే ఊరుకోమని గట్టి వార్నింగే ఇచ్చారు.

ఇండియాకు బ్రిటన్ సపోర్ట్

కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా పరిష్కరించాలంటే.. పీవోకేను ఇండియా స్వాధీనం చేసుకోవాల్సిందేనని సూచించారు బ్రిటన్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్. అదొక్కటే ఉగ్రవాద సమస్యకు సొల్యూషన్ అన్నారు. PoK ఎప్పటికీ భారత్‌దే అన్నారాయన. బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ఇండియాకు అండగా నిలిచింది. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఇటీవల అభినందన్ వర్థమాన్ ఫోటో చూపిస్తూ.. భారతీయుల పీకలు కోస్తాం అంటూ సైగలు చేసిన.. లండన్‌లో పాక్ ఎంబసీ అధికారి తీరుపై విచారణ చేస్తున్నట్టు ప్రకటించింది.

లష్కరే చీఫ్ ఉండేది ఎక్కడంటే..

మరోవైపు, లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ ఇంటి ఉపగ్రహ చిత్రాలు లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చాయి. అతను జైల్లో లేడని తెలుస్తోంది. లాహోర్‌లోని ఓ రద్దీ ప్రాంతంలోని లగ్జరీ ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంటి పక్కనే పార్కు, మసీదు, మదర్సా ఉన్నట్టు తెలుస్తోంది. బిల్డింగ్ కింద పటిష్టమైన బంకర్ కూడా ఉన్నట్టు సమాచారం. పాక్ భద్రతా బలగాలు అతని ఇంటికి రక్షణ కల్పిస్తున్నాయి.

Also Read : మోదీ సెలక్ట్ చేసిన సూపర్ ఆఫీసర్స్.. పవర్‌ఫుల్ కాంబినేషన్

Also Read : పహల్గాంలో మన పొరపాట్లు ఇవే..

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×