BigTV English

Jammu Kashmir: కాశ్మీర్ లేకపోతే భారత్ పరిస్థితి ఏమిటి? మీకు తెలియని షాకింగ్ నిజాలు

Jammu Kashmir: కాశ్మీర్ లేకపోతే భారత్ పరిస్థితి ఏమిటి? మీకు తెలియని షాకింగ్ నిజాలు

పహల్గాం దాడుల విషయంలో జమ్మూకాశ్మీర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. దేశ విభజన సమయంలో జమ్మూకాశ్మీర్.. భారత్, పాక్ మధ్య తెగని సమస్యగా మారింది. ఆ ప్రాంతం కోసమే యుద్ధం మొదలైంది. ఆ ప్రాంతం కోసమే తీవ్రవాదం పుట్టుకొచ్చింది. ఆ ప్రాంతం కోసమే నేటికీ పోరాటం జరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాన్ని కోల్పోయాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా దాన్ని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోడానికి పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలో కాశ్మీర్ ని లాగేసుకోడానికి పాక్ కుతంత్రాలు పన్నుతోంది. అక్కడ అలజడి రేకెత్తించి భూమిపై స్వర్గంలా ఉన్న కాశ్మీర్ ని చిందరవందర చేసి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటోంది. ఆ అలజడితో భయపడిపోయి కాశ్మీర్ ని తమకు అప్పగిస్తారేమోననే దురాశ పాకిస్తాన్ ది. కానీ కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకోడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అసలింతకీ కాశ్మీర్ లో ఏముంది..? అది మన దేశానికి ఎందుకంత ప్రత్యేకత.


ప్రపంచ పటంలో భారత దేశాన్ని ఒక ప్రాణం ఉన్న ఆకారంగా భావిస్తే దానికి తలలాంటిది జమ్మూ కాశ్మీర్. ఆ ప్రాంతం లేకపోతే తలలేని మొండెం లాగా ఉంటుంది భారత పటం. కేవలం ఆకారానికే కాదు, నిజంగానే కాశ్మీర్ అనేది భారత్ కు ఆత్మలాంటిది.

కాశ్మీర్ లో ఏముంది..?
భారత్ లో అందుబాటులో ఉండే కుంకుమ పువ్వు 100 శాతం కాశ్మీర్ లోనే పండుతుంది. మన దేశం నుంచి అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్న వాల్ నట్ 95 శాతం కాశ్మీర్ లోనే లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ యాపిల్ పంట 75శాతం కాశ్మీర్ లోయలోనే పండుతుంది. శ్రీనగర్, బారాముల్లా, పుల్వామా ప్రాంతాలు గోల్డెన్ యాపిల్ పంటకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. రాజోరీ, పూంచ్ ప్రాంతాల్లో 30 శాతం తేనె లభిస్తుంది. పుట్టగొడుగులకు కూడా జమ్మూకాశ్మీర్ సుప్రసిద్ధం. జమ్మూ ప్రాంతంలో 30శాతం పుట్టగొడుగులు లభిస్తాయి. లద్దాక్ నుంచి 40 శాతం ఆప్రికాట్ లభిస్తుంది. కాశ్మీరీ శాలువాలు 80శాతం ఇక్కడే తయారు చేస్తారు.


భువిపై స్వర్గం..
జమ్మూ కాశ్మీర్ ని భూతల స్వర్గంగా పేర్కొంటారు. అక్కడ అందమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, ఉల్లాసభరితంగా ఉండే కొండలు, లోయలు విహారయాత్రలకు అనుకూలంగా ఉంటాయి. దాల్ లేక్ షికారా రైడ్ అత్యద్భుతంగా ఉంటుంది. సోన్ మార్గ్, గుల్ మార్గ్, పహల్గాం ప్రాంతాలను కలిపి మినీ స్విట్జర్లాండ్ అంటారు. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరం కె2 జమ్మూకాశ్మీర్ లోని హిమాలయాల్లో ఉంది. భారత్ లో అత్యంత పొడవైన రైల్ టన్నెల్ పీర్ పంజల్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ కూడా కాశ్మీర్ కి ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది. అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి దర్శనం.. ఇవన్నీ కాశ్మీర్ భారత్ లో ఉండటం వల్లే మనకు సాధ్యమవుతున్నాయి. లేకపోతే ఆయా ప్రాంతాలకు మనం కూడా వీసా తీసుకుని వెళ్లాల్సిందే.

Also Read: పీవోకే స్వాధీనం సాధ్యమేనా? అఖండ భారత్‌‌కు ఎదురవుతున్న సవాళ్లు ఇవే!

10వేల కోట్ల ఆదాయం..
జమ్మూ కాశ్మీర్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఏడాదిలో ఒక్కసారి, వేసవి సమయంలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది మొత్తం అక్కడి ప్రజలకు జీవనభృతి. ప్రతి ఏటా టూరిస్ట్ ల ద్వారా 10వేల కోట్ల రూపాయల ఆదాయం జమ్మూకాశ్మీర్ ప్రజలకు లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే జమ్మూకాశ్మీర్ ని సొంతం చేసుకోవాలనుకుంటోంది పాక్. అందుకోసం పాపిష్టి పనులన్నీ చేస్తోంది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×