Bhendi Samosa Viral| సోషల్ మీడియా రావడంతో అందరూ ఫేమస్ అయిపోవడానికి కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు. కొందరు ప్రాణాలు తెగించి స్టంట్లు చేస్తుంటే.. మరి కొందరు విచిత్ర వంటకాలతో వైరల్ అయిపోతున్నారు. ఈ రెండో కోవలో తాజాగా ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ బెండకాయ్ సమోసా చేశాడు. ఇప్పుడు ఈ సమోసాలు చూసి నెటిజెన్లు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని విచిత్రం అంటుంటూ మరి కొందరు వద్దు బాబోయ్ ఇక ఆపేయండి. అని రాస్తున్నారు.
ఇన్‌స్ట్రాగ్రామ్ లో అక్షిత జైన్ అనే ఒక ఫుడ్ కంటెంట్ క్రియేటర్ పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆమె క్యాప్షన్ ఈ విధంగా పెట్టింది. “మీరు ఎప్పుడైనా బెండకాయ సమోసా తిన్నారా?” అని. ఆ వీడియోలో ఒక సమోసా దుకాణానికి వెళ్లి ప్లేట్ సమోసా ఆర్డర్ చేస్తే.. అతను సమోసా విరగొట్టి అందులో చట్నీ, కొత్తిమీర వేసి ఇస్తున్నాడు. అయితే ఆ సమోసాలో సాధారణంగా ఉండాల్సిన ఆలు (బంగాళదుంపలు) లేదా ఆనియన్స్ లేవు. ఇది చూసి నెటిజెన్లకు విషయం మింగుడు పడేలేదు. ఎందుకంటే ఆ సమోసాలో ఆలు గడ్డకి బదులు బెండకాయ స్టఫింగ్ ఉంది. ఇప్పుడు ఈ బెండకాయ్ సమోసాల వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
నెటిజెన్లు ఈ వైరల్ వీడియో చూసి “ప్లీజ్ స్టాప్” అని కామెంట్లు చేస్తున్నారు. భారతదేశంలో చాలామంది సమోసాలంటే ఇష్టంగా తింటారు. అందుకే వాటిలో ఏదైనా నచ్చని మార్పులు చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే ఒక యూజర్ కామెంట్ లో.. “నా బుర్ర పనిచేయడం లేదు. దాన్ని మీరు ప్లీజ్ ఆపేయండి” అని రాశాడు. మరొకరైతే.. “ఈ జీవితంలో ఇలాంటిది చూస్తానను కోలేదు.” అని కామెంట్ చేశారు.
“మరొకరైతే ఆలో లేకుండా సమోసా చేయడమేంటి. ఇది సమోసాలకే అవమానం. ఉన్నదాన్ని అలాగే వదిలేయండి. ప్రయోగాలు చేయొద్దు”, అని పొడువైన కామెంట్ రాశాడు.
చాక్లెట్ ఇడ్లీలు
ఇక ఇలాంటి ప్రయోగాలు చేసేవారికి సోషల్ మీడియాలో కొరత లేదు. ఒకడైతే చాక్లెట్ ఇడ్లీలు చేశాడు. ఇడ్లీలో చాక్లెట్, ఫ్రూటీ జామ్స్, స్వీట్లు వంటి వాటి వెరైటీగా రకరకాల ఇడ్లీలు వండాలు. అది చూసి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న వంటకాన్ని నాశనం చేశావు కదరా.. అని రాశారు.
Also Read: ఆ దేవతకు నూడుల్స్, ఫ్రైడ్ రైస్ నైవేద్యం.. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో తెలుసా?
జామూన్ పరాఠా
ఇంకొకరైతే జామూన్ పరాఠా చేశాడు. పచ్చిగా ఉన్న పరాఠా రొట్టెలో గులాబ్ జామూన్ వేసి స్టఫింగ్ చేసి దాన్ని కాల్చి కస్టమర్లకు పెట్టాడు. అయితే కొందరు నెటిజెన్లు దీన్ని ఇష్టపడితే మరొకొందరు దీన్ని తినకుండా ఉండడమే మంచిది అని కామెంట్ చేశారు.
కూల్ డ్రింక్ ఆమ్లేట్.. గుడ్డుతో ఆమ్లేట్ చేిస అందులో ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, కొత్తిమీరతో పాటు సెవెన్ అప్, మిరిండా లాంటి కూల్ డ్రింక్స్ వేసి ఇస్తున్నాడు. అది చూసి నెటిజెన్లు ఏ ఉరయ్యా తమరిది.. ఇలా తింటే ఆరోగ్యం నాశనమవుతుందని తెలీదా? అని రాశారు.