Jammu Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పహల్గామ్‌లో టూరిస్టులపై తుపాకులతో తెగబడ్డారు. ఇటీవల కాలంలో అడపాదడపా కశ్మీర్‌లో దూకుడు పెంచిన ఉగ్రవాదులు ఇప్పుడు వ్యూహాత్మకంగానే దాడులుకు దిగుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ట్రెక్కింగ్ కోసం వచ్చిన ఓ బృందం వద్దకు ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. ముందుగా వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. విచక్షణరహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పాలి. గాయపడి చెల్లాచెదురుగా పడిపోయిన వ్యక్తులకు స్థానికులు సహాయం చేశారు.
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 28 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇక మృతుల్లో ముగ్గురు తెలుగువాళ్లు మృతిచెందినట్లు సమచారం. జమ్ము ఉగ్రదాడిలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా మృతి చెందాడు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్‌గా గుర్తించారు. మృతుల్లో అనేక రాష్ట్రాల వారీతో పాటు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. పహల్గామ్ లో మధుసూదన్‌ను టెర్రరిస్టులు చంపేశారు. ఇక విశాఖ వాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 18న మరో ఐదుగురితో కలిసి ఆయన కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26న తిరిగి విశాఖకు రావాల్సిఉండగా.. ఉగ్రదాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు చంద్రమౌళి ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పారిపోతున్నా వదలకుండా వెంటాడి కాల్చి చంపారు. చంద్రమౌళి మృతదేహాన్ని గుర్తించిన సహచర టూరిస్ట్‌లు గుర్తించారు. సమాచారం అందుకున్న చంద్రమౌళి కుటుంబసభ్యులు.. పెహల్గాం బయల్దేరివెళ్లారు.
వైజాగ్ లో రెండేళ్ల క్రితమే చంద్రమౌళి ఫ్లాట్ కొనుగోలు చేశాడని అపార్ట్ మెంట్ సెక్రటరీ తెలిపారు. టూర్ కు వెళ్లే ముందు కూడా మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పాడని గుర్తుచేసుకున్నాడు. కానీ ఈలోగా ఇలా జరగడం బాధాకరమంటున్నారు.
కాగా.. జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడితో ఆర్మీ, జేకే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల కోసం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. చాపర్స్, డ్రోన్స్‌తో టెర్రరిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఘటనాస్థలికి మరో NIA టీమ్ కాసేపట్లో చేరుకోనుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని దిగ్భందం చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన వారిపై ఆరా తీస్తున్నారు. ఉగ్రదాడికి ఉపయోగించిన ఓ బైక్‌ను గుర్తించారు.
ఈ ఉగ్రదాడికి లష్కరే తొయిబా డిప్యూటీ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్‌గా గుర్తించారు. ఇటీవల అతడు మాట్లాడిన వీడియోను సర్క్యూలేట్ అవుతోంది. ఇటు ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టు ఫొటో సైతం బయటకు వచ్చింది. జుబ్బా ధరించి, చేతిలో గన్ పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది.
Also Read: హనీమూన్‌కి వెళ్తే.. ఉగ్రవాదులు ఎంత దారుణంగా చంపారంటే
ఇటు ఉగ్రదాడిపై కాసేపట్లో హైలెవల్ మీటింగ్ ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇప్పటికే సౌదీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుల దిగిన వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోనే NSA అజిత్ దోవల్, విదేశాంగమంత్రి జైశంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.