BigTV English

KL Rahul – Goenka: KL రాహుల్ దెబ్బ అదుర్స్… కాళ్ళ బేరానికి వచ్చిన LSG ఓనర్

KL Rahul – Goenka: KL రాహుల్ దెబ్బ అదుర్స్… కాళ్ళ బేరానికి వచ్చిన LSG ఓనర్

KL Rahul – Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇప్పటివరకు 40 మ్యాచ్లు పూర్తయ్యాయి. మరో సగం మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో.. Kl రాహుల్ హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా రాహుల్ జపం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా… ఢిల్లీ మ్యాచ్ ను చూసేందుకు లక్నో దాకా వెళ్లారు. అంతలా కే ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సీజన్లో దుమ్ము లేపుతున్నాడు కేఎల్ రాహుల్.


Also Read: Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

ఈ నేపథ్యంలోనే… తాజాగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా పొగరు మొత్తం దించాడు కేఎల్ రాహుల్. లక్నో జట్టుపై… అద్భుతమైన ఇన్నింగ్స్ తో దుమ్ములేపాడు రాహుల్. ఈ దెబ్బకు లక్నో దారుణంగా ఓడిపోయింది. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రిషబ్ పంత్ డక్ అవుట్ అయితే… వద్దనుకున్న కేఎల్ రాహుల్ మాత్రం… లక్నో ఓనర్ సంజీవ్ పరువు తీశాడు. లక్నో జట్టు పైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. తనను అవమానించిన లక్నోను… చీల్చి చెండాడాడు కేఎల్ రాహుల్.


లక్నో ఓనర్ పరువు తీసిన కేఎల్ రాహుల్

లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముఖ్యంగా లక్నో మాజీ కెప్టెన్ ఢిల్లీ ప్రస్తుత ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. 57 పరుగులు చేసి లక్నోను ఓడించాడు ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు.. సెకండ్ ఇచ్చుకోవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యం లోనే పంత్ ను హగ్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్. అనంతరం గ్రౌండ్ లోకి వచ్చిన లక్నో ఓనర్ సంజీవ్… కేల్ రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించే ప్రయత్నం చేశాడు.

అయితే రాహుల్ మాత్రం అతనితో మాట్లాడేందుకు… అస్సలు ఇష్టపడలేదు. షేక్ అండ్ ఇచ్చి అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు కేఎల్ రాహుల్. దీంతో లక్నో ఓనర్ సంజీవ్ ముఖం వాలిపోయింది. గతంలో లక్నో కెప్టెన్ గా రాహుల్ ఉన్నప్పుడు అతన్ని దారుణంగా… తిట్టాడు లక్నో ఓనర్ సంజీవ్. అప్పుడు కేల రాహుల్ ఎంత మాట్లాడినా… వినకుండా సంజీవ్ రెచ్చిపోయాడు. ఇక ఇప్పుడు సంజు మాట్లాడేందుకు పలకరిస్తే రాహుల్ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… లక్నో ఓనర్ సంజీవ్ కు ఇది కావాల్సిందే అన్నట్లుగా… కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: KL Rahul: KL రాహుల్, పంత్ ఇద్దరు కలిసి.. LSG సంజీవ్ గోయెంకాను బకరా చేసారు కదరా

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×