BigTV English

Rajasthan MP Chhattisgarh CM Race | సీఎం పదవి కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో తీవ్ర పోటీ

Rajasthan, MP, Chhattisgarh CM Race | మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల పర్వం ముగిసినా.. ఆయా రాష్ట్రాల్లో మరో పోటీ మొదలైంది. ఈ పోటీ బిజేపీ నేతల మధ్యే నెలకొంది. గెలుపు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

Rajasthan MP Chhattisgarh CM Race | సీఎం పదవి కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో తీవ్ర పోటీ

Rajasthan MP Chhattisgarh CM Race | మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల పర్వం ముగిసినా.. ఆయా రాష్ట్రాల్లో మరో పోటీ మొదలైంది. ఈ పోటీ బిజేపీ నేతల మధ్యే నెలకొంది. గెలుపు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.


మూడు రాష్ట్రాల్లోనూ సీనియర్లే ముందంజలో ఉన్నా.. బిజేపీ అధిష్ఠానం కొత్తవారిపై మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఈ విషయంపై జాతీయ స్థాయిలో ఎవరు కాబోయే సిఎం అనే చర్చ మొదలైంది. మధ్యప్రదేశ్ ఇప్పటికే పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పదవిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వసుంధరా రాజే, రమణ్ సింగ్‌లు ముందంజలో ఉన్నారు.

కానీ వారిపై బిజేపీ పెద్దలైన నరేంద్ర మోదీ, అమితా షా ద్వయం ఆసక్తి చూపడం లేదు. మరి కొన్ని నెలల్లో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు బిజేపీకి బాగా ఉపయోగపడతారనే ద‌ృష్టికోణంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇంతకు ముందు బిజేపీ పెద్దలు ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ని ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అలాగే ఉత్తరాఖండ్‌తో సీఎంను రెండు సార్లు మార్చారు.


ఈ విషయం డిసెంబర్ 5, మంగళవారం రాత్రి ప్రధాన మంత్రి మోదీ నివాసంలో బిజేపీ పెద్దలు 5 గంటల పాటు చర్చించారని తెలిసింది. అంతకుముందు అమితా షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మూడు రాష్ట్రాల బిజేపీ ఇన్‌చార్జీలతో చర్చలు చేశారు. ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించారు.

రాజస్థాన్ సిఎం పదవి కోసం రేసులో ఉన్నది వీరే.
ప్రథమంగా మాజీ సీఎం వసుంధర రాజే ఉన్నారు. కొత్త ముఖాలుగా బిజేపీ నేత రాజ కుటంబ సభ్యురాలు దియా కుమారి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, బిజేపీ నేత మహంత్ బాలక్ నాథ్ లు ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర సిఎం పదవి కోసం రేసులో ఉన్నది వీరే.
సిట్టింగ్ సీఎం శివరాజ్ సింగ్ ముందంజలో ఉండగా.. తరువాతి స్థానాల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్‌తో పాటు బిజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ వర్గీయ ఉన్నారు.

ఛత్తీస్ గఢ్ సిఎం పదవి కోసం రేసులో ఉన్నది వీరే.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా మాజీ సీఎం డాక్టర్ రమణ్ సింగ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. తరువాతి స్థానంలో ఛత్తీస్ గఢ్ బిజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, సీనియర్ నేత ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐపిఎస్ అధికారి ఓపీ చౌదరి పేర్లు జాబితాలో ఉన్నాయి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×