BigTV English

Jharkhand Assembly elections results: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా

Jharkhand Assembly elections results: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా

⦿ సోరెన్ మళ్లీ గెలిచెన్
⦿ జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి
⦿ 81కి 55 స్థానాల్లో విజయబావుటా
⦿ వరుసగా రెండోసారి సీఎంగా సోరెన్ చరిత్ర
⦿ కేసులు, జైలుపాలైనా చెక్కుచెదరని జానాదరణ
⦿ చతికిలపడ్డ బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే
⦿ 21 స్థానాలకే పరిమితమైన బీజేపీ


రాంచీ, స్వేచ్ఛ: ఈడీ కేసులు పెట్టినా.. సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లినా.. ఎన్నికల ముందు కుడి భుజం లాంటి నేత పార్టీని వీడినా.. ఇవేమీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ గెలుపుని ఆపలేకపోయాయి. చారిత్రాత్మక రీతిలో జార్ఖండ్‌లో వరుసగా రెండోసారి సీఎం హేమంత్ సోరెన్ సర్కారు కొలువుదీరబోతోంది. జేఎంఎం సారధ్యంలోని ఇండియా కూటమిని ఓటర్లు మరోసారి ఆశీర్వదించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి కూటమికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా ఇండియా కూటమి రికార్డు స్థాయిలో 55 సీట్లు గెలుచుకుంది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కేవలం 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 41 సీట్లు కాగా హేమంత్ సోరెన్ సారధ్యంలోని జేఎంఎం సింగిల్‌గా 33 స్థానాలు కైవసం చేసుకుంది. కూటమిలోని కాంగ్రెస్-16, ఆర్జేడీ-4, సీపీఐఎంల్-2 స్థానాలు గెలుచుకోవడంతో మరో దఫా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగుమం అయింది. జార్ఖండ్ చరిత్రలో అధికార పక్షం ఎన్నికల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. ఇక విపక్ష ఎన్డీయేలోని బీజేపీ-21, జేడీయూ-1, ఎల్‌జేపీఆర్‌‌వీ-1, ఏజేఎస్‌యూపీ-1 స్థానాల్లో విజయం సాధించగా, ఇతరులు 1 చోట గెలిచారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి 45 శాతం ఓట్లు, ఎన్డీయేకి 38 శాతం ఓట్లు, జేకేఎల్‌కేఎం పార్టీకి 6.16 శాతం, ఇతరులకు 17 శాతం ఓట్లు దక్కాయి.

సోరెన్ ఎఫెక్ట్.. విజయం దాసోహం
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కీలక పాత్ర పోషించారు. భూకుంభకోణం ఆరోపణలపై ఈడీ కేసులు పెట్టడం, అనంతర ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లడం వంటి పరిణామాల్లో జనాల్లో ఆయనపై సానుభూతిని పెంచాయి. ఆయనపై ఈడీ కేసులు ఉన్నా ప్రజల్లో మాత్రం ఆదరణ చెక్కుచెదరలేదని జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు నిరూపించాయి. ఈ ఏడాది జనవరిలో సీఎం పదవికి రాజీనామా చేసి హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి బాధ్యతలను గిరిజన నాయకుడు చంపాయీ సోరెన్‌కు అప్పగించారు. బెయిల్ లభించడంతో జులైలో తిరిగి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే అనూహ్యంగా చంపాయీ సోరెన్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ పరిణామాలన్నింటినీ హేమంత్ సోరెన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల పోరాటం ‘బీజేపీ వర్సెస్ హేమంత్ సోరెన్’ అని జనాల్లోకి తీసుకెళ్లడంతో సఫలీకృతమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఇబ్బంది పెడుతోందని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈడీని ప్రయోగించిందంటూ జనాల్లోకి తీసుకెళ్లడంతో ఆయన విజయవంతమయ్యారు. ఎన్డీయే తరపున స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించినా.. హేమంత్ సోరెన్ కూడా ధీటుగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను పంపించివేస్తామని ఎన్డీయే హామీ ఇచ్చినా హేమంత్ సోరెన్ మాత్రం సంక్షేమ పథకాలను బలంగా నమ్ముకొని ప్రచారం చేశారు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. దీనికి తోడు కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేయడం కూడా సానుకూలంగా మారాయి.


సోరెన్‌తో భట్టి విక్రమార్క సంప్రదింపు
జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంప్రదింపులు జరుపుతున్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకుడిగా, చీఫ్ క్యాంపెయినర్‌గా భట్టి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన రాంచీలోనే ఉన్నారు. కూటమికి సానుకూల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ నివాసానికి వెళ్లి మాట్లడారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మరోసారి అధికారన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×